Latest Updates
-
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు! -
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.! -
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే.. -
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది?
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
రాగితో సంగటి వండినా, జావ చేసినా, ఇడ్లీ చేసినా, క్రిస్పీ దోసె చేసినా ఏదైనా సరే అమృతమే. ఆరోగ్యాకి మేలు చేయడంలో రాగులను మించిన ఆహారం ఇంకోటి లేదు. అయితే రాగి పిండితో దోశలు,ఇడ్లీలు కాకుండా ఓ సారి క్రంచీ బిస్కెట్లు ట్రై చేసి చూడండి. సూపర్ టేస్ట్ ఉంటాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.
రాగి పిండి, గోధుమ పిండి, కొబ్బరి, బెల్లం వంటి బలవర్ధకమైన పదార్థాలతో చేసే బిస్కెట్లు పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా ఎంతో మేలు చేస్తాయి. సాయంత్రం టీ టైమ్ లోకైనా, పిల్లల స్నాక్స్ బాక్స్ లోకైనా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే రాగి బిస్కెట్లు ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

రాగి బిస్కెట్లు తయారీకి కావలసిన పదార్థాలు
రాగి పిండి - 1 కప్పు
గోధుమ పిండి - అర కప్పు
మొక్కజొన్న పిండి - 1 టేబుల్ స్పూన్
నెయ్యి -పావు కప్పు
బెల్లం పొడి - 1 కప్పు
ఎండు కొబ్బరి పొడి - పావు కప్పు
వేయించిన జీడిపప్పు పొడి - అర టీస్పూన్
యాలకుల పొడి - చిటికెడు
బేకింగ్ సోడా - చిటికెడు
కాచి చల్లార్చిన పాలు - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - బేక్ చేయడానికి సరిపడా
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్
రాగి బిస్కెట్లు తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని, అందులో రాగి పిండి, గోధుమ పిండి, కార్న్ స్టార్చ్, అలాగే చిటికెడు బేకింగ్ సోడా వేసి జల్లెడ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండిలో గడ్డలు లేకుండా బిస్కెట్లు గుల్లగా వస్తాయి.
-మరొక బౌల్ తీసుకుని అందులో కరిగించిన నెయ్యి, బెల్లం పొడి వేసి రెండూ బాగా కలిసేలా గరిటెతో తిప్పాలి. ఆ తర్వాత అందులో ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు పొడి,కొద్దిగా యాలకుల పొడి వేసి కలపాలి.
-ఇప్పుడు నెయ్యి-బెల్లం మిశ్రమంలో ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని కొద్దికొద్దిగా వేస్తూ చేత్తో బాగా కలుపుకోవాలి. పిండి మరీ పొడిగా అనిపిస్తే కాచి చల్లార్చిన పాలను ఒకట్రెండు స్పూన్లు వేసి మృదువైన ముద్దలా కలుపుకోవాలి.
-సిద్ధం చేసుకున్న పిండి ముద్ద నుంచి చిన్న చిన్న భాగాలుగా తీసుకుని, మీకు నచ్చిన ఆకారంలో గుండ్రంగా లేదా బిస్కెట్ల లాగా కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి.
-మందపాటి అడుగు ఉన్న ఒక పెద్ద గిన్నె లేదా కడాయి తీసుకుని,అందులో అడుగున ఉప్పు చల్లాలి. దాని మధ్యలో ఒక చిన్న స్టాండ్ ఉంచి, మూతపెట్టి 5 నిమిషాల పాటు వేడి చేయాలి. ఆ తర్వాత నెయ్యి రాసిన ఒక ప్లేట్ లో మనం తయారు చేసుకున్న బిస్కెట్లను కొద్దిగా గ్యాప్ ఉంచుతూ పేర్చి, ఆ ప్లేట్ ను స్టాండ్ మీద ఉంచాలి. గాలి పోకుండా మూతపెట్టి చిన్న మంట మీద సుమారు 30 నిమిషాల పాటు బేక్ చేయాలి.
-మీ దగ్గర ఓవెన్ ఉంటే.. 110°C ఉష్ణోగ్రత దగ్గర సుమారు 15 నిమిషాల పాటు బేక్ చేస్తే సరిపోతుంది.
-బేక్ అయిన తర్వాత వెంటనే తీయకుండా, కుకీస్ పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారేకొద్దీ ఇవి కరకరలాడుతూ భలే రుచిగా మారతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications