Latest Updates
-
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
వంకాయతో ఇలా పకోడీ చేస్తే ప్లేట్ క్షణాల్లో ఖాళీ అవ్వాల్సిందే!
ఆకాశంలో కారు మేఘాలు కమ్ముకుని, చిటపట చినుకులు రాలుతున్నాయంటే చాలు.. మన మనసు ఎటూ వినకుండా వేడివేడిగా, కరకరలాడే స్నాక్ ఏదైనా తినాలని ఆరాటపడుతుంది. వర్షానికి, పకోడీలకు మధ్య ఉన్న ఈ అందమైన అనుబంధం ప్రతి భారతీయుడి హృదయానికి ఎంతో సుపరిచితమైనది. అయితే వర్షం పడిన ప్రతిసారీ అదే రొటీన్ ఉల్లిపాయ పకోడీ, బంగాళదుంప లేదా మిరపకాయ బజ్జీలు తిని మీకు విసుగొచ్చిందా? అయితే ఈ సారి కాస్త కొత్తగా, మీ నోటికి అద్భుతమైన రుచి తగిలేలా కరకరలాడే వంకాయ పకోడీల ట్రై చేయండి. ఈ పకోడీల రుచి చూశారంటే, వంకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని మరీ ఇష్టంగా తింటారు.

వంకాయ పకోడి తయారీకి కావలసిన పదార్థాలు
తాజా వంకాయ: 1 పెద్దది
శనగ పిండి: 1 కప్పు
బియ్యం పిండి: 2 టేబుల్ స్పూన్లు
వాము: అర టీస్పూన్
ఎర్ర కారం పొడి: 1 టీస్పూన్
పసుపు పొడి: అర టీస్పూన్
చాట్ మసాలా: 1 టీస్పూన్
కొత్తిమీర ఆకులు: సన్నగా తరిగినవి కొద్దిగా
ఉప్పు: మీ రుచికి తగినంత
నీరు: పిండి మిశ్రమం కలుపుకోవడానికి తగినంత
వంట నూనె: డీప్ ఫ్రై చేయడానికి
వంకాయ పకోడి తయారీ విధానం
-ముందుగా వంకాయను శుభ్రంగా కడిగి, ఒకే సైజులో పల్చని గుండ్రని ముక్కలుగా కోసుకోవాలి. కోసిన వెంటనే ఈ ముక్కలు నల్లబడకుండా ఉండటానికి వాటిని కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో నానబెట్టండి. నూనెలో వేయించడానికి కొద్ది నిమిషాల ముందు ఆ ముక్కలను నీటిలో నుండి తీసి, ఒక పొడి వస్త్రంతో తడి లేకుండా అద్దాలి.ః
-ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో ఒక కప్పు శనగపిండి, రెండు చెంచాల బియ్యప్పిండి వేయండి. ఆ తర్వాత వాము, కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులను వేసి బాగా కలపాలి. ఉండలు కట్టకుండా కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చిక్కటి జారుడు పిండిలా కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా ఉంటే ముక్కకు సరిగ్గా పట్టదు, కాబట్టి సరైన కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి.
-స్టవ్ వెలిగించి, మందపాటి బాండీ పెట్టి తగినంత నూనె పోయండి. నూనెను అధిక మంట మీద బాగా వేడి చేయండి. నూనె కాగిన తర్వాత, పకోడీలు మాడిపోకుండా మంటను వెంటనే మీడియం ఫ్లేమ్ కు తగ్గించాలి.
-ఇప్పుడు సిద్ధం చేసుకున్న వంకాయ ముక్కలను ఒక్కొక్కటిగా పిండి ద్రావణంలో వేసి, ముక్కకు రెండు వైపులా పిండి బాగా పట్టేలా ముంచాలి. ఆ ముక్కను జాగ్రత్తగా కాగుతున్న నూనెలో వేయాలి. పకోడీలను రెండు వైపులా తిప్పుతూ బంగారు రంగు వచ్చే వరకు కరకరలాడేలా వేయించుకోవాలి.
-నూనెలో నుండి తీసిన వేడివేడి పకోడీలను టిష్యూ ఉన్న ప్లేట్ లోకి తీసుకుంటే, అదనపు నూనె మొత్తం పోతుంది. ఇప్పుడు ఆ కరకరలాడే వంకాయ పకోడీల మీద కొద్దిగా చాట్ మసాలా చల్లండి. ఆ పుల్లటి రుచి వీటికి అద్భుతమైన కిక్ ఇస్తుంది. వీటికి జతగా కారంగా ఉండే గ్రీన్ చట్నీ లేదా తీయటి టొమాటో కెచప్ ఉంటే అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
