Latest Updates
-
ఇంట్లో దేవతా చిత్రాలు ఎక్కడ ఉంచాలి? శాస్త్రాలు చెప్పే నియమాలు -
ఫెమినిజం అంటే వాటితో పోలిక కాదు.. నెట్టింట్లో చర్చకు దారి తీస్తున్న సునీత కామెంట్స్.. అసలేమన్నారు.! -
అటు ప్రొటీన్, ఇటు టేస్ట్.. పిల్లలు లంచ్ బాక్స్‌లోకి ఇష్టంగా తినేలా పనీర్ ఖీమా రైస్.! -
పిల్లల నుంచి పెద్దల వరకు.. రక్తహీనత పోగొట్టి ఎముకల బలాన్ని పెంచే రాగి బీట్రూట్ జున్ను.! -
టైమ్ తక్కువ, టేస్ట్ ఎక్కువ..లంచ్ బాక్సులకు పర్ఫెక్ట్ పుదీనా పులావ్ చేసేయండిలా -
మొహర్రం పవిత్ర మాసం సందర్భంగా మీ ప్రియమైన వారికి విషెస్ ఇలా తెలియజేయండి.! -
గుండెకు బ్యాడ్ మార్నింగ్.. ఆ సమయాల్లో ఆహార ఎంపికలతో పెను ముప్పు.! -
జూన్ 26 సాయంత్రం ఈ 5 రాశుల వారికి అదృష్టం.. ధనయోగం, కెరీర్ సక్సెస్ మీ సొంతం! -
ఈరోజు సాధ్య యోగం.. ఈ పనులు మొదలుపెడితే తిరుగులేని విజయం మీదే! -
ఒత్తిడికి గురవుతున్నారా.. ఇది మీ జుట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా.?
ఈ కమ్మటి టమాటా గ్రేవీ చేస్తే.. తెలియకుండానే రెండు ఇడ్లీలు,దోశలు ఎక్కువే లాగించేస్తారు!
ఉదయం నిద్రలేవగానే బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలి? అందులోకి కాంబినేషన్ గా ఏ చట్నీ చేయాలి? అనేది ప్రతి ఇంట్లో ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న. రోజూ తినే ఇడ్లీ, దోశల కోసం ఎప్పుడూ ఒకేరకమైన పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా సాంబార్ చేసి.. చేసి మీకు విసుగొచ్చేసిందా? అయితే వాటికి బదులుగా మరింత ఆకలి పుట్టించేలా, రుచిలో కాస్త భిన్నంగా ఉండే అదిరిపోయే సైడ్ డిష్ ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నారా?
మీ ఇంట్లో టొమాటోలు, ఉల్లిపాయలు ఉంటే చాలు..నోరూరించే టమాటా గ్రేవీ చేసి చూడండి. దీన్ని తయారు చేయడం చాలా సులభం. పైగా రుచి అద్భుతంగా ఉంటుంది. మెత్తటి వేడివేడి ఇడ్లీలపైన, కరకరలాడే దోశలపైన ఈ టమాటా గ్రేవీని వేసుకుని తింటుంటే.. తెలియకుండానే రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు.

టమాటా గ్రేవీ తయారీకి కావలసిన పదార్థాలు
పచ్చిమిరపకాయలు - 5
అల్లం - 1 అంగుళం ముక్క
వేరుశెనగ గుళ్లు (పల్లీలు) -ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
సోంపు- 1 టీస్పూన్
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
ఉల్లిపాయలు - 2
కరివేపాకు - 1 రెబ్బ
టమాటాలు - 4
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నీరు - 2 కప్పులు
టమాటా గ్రేవీ తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, అల్లం వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఆ తర్వాత మిక్సీ జార్ ను తడి లేకుండా తుడిచి, అందులో వేరుశెనగలు (పల్లీలు), సోంపు వేసి మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా నీళ్లు పోసి జారుగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె పోసి, అది వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేయించండి. ఉల్లిపాయలు లేత రంగులోకి మారిన తర్వాత ముందుగా రుబ్బిపెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేయాలి. దానికి రుచికి సరిపడా ఉప్పు, పసుపు జతచేసి బాగా కలపాలి. మూతపెట్టి టమోటాలు బాగా మెత్తబడి, నూనె పైకి తేలే వరకు సన్నని మంటపై మగ్గనివ్వాలి.
-టమాటాలు మెత్తబడిన తర్వాత, అందులో 2 కప్పుల నీళ్లు పోసి బాగా కలపండి. మూత పెట్టి మీడియం మంటపై 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి.
-గ్రేవీ బాగా మరుగుతున్నప్పుడు మూత తీసి ముందుగా నీళ్లలో కలిపి పెట్టుకున్న వేరుశెనగపిండి మిశ్రమాన్ని అందులో నెమ్మదిగా పోస్తూ గరిటెతో కలపాలి. మళ్ళీ మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు సిమ్‌లో ఉడికించండి.
-అంతే వేడివేడి టమోటా గ్రేవీ రెడీ. చపాతీలు, పూరీల్లోకి కూడా ఇది అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications