Latest Updates
-
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది!
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం!
రాఖీ పండుగకి అయినా లేదా తీపి తినాలనిపిస్తుందనుకున్నప్పడు ఒక్కసారి గోధుమపిండి లడ్డు ట్రై చేసి చూడండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలను అందిస్తుంది. పిల్లలకు సాయంత్రం వేళ స్నాక్ గా ఇవ్వడానికి లేదా పండుగ సమయాల్లో చేసుకోవడానికి ఇవి చాలా అనువుగా ఉంటాయి.
తక్కువ సమయంలో, ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. అద్భుతం, అమోఘం అనిపించేలా గోధుమపిండి లడ్డు మీ ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

గోధుమపిండి లడ్డు తయారకి కావాల్సిన పదార్థాలు
-నెయ్యి
-బొంబాయి రవ్వ
-కర్జూజ గింజలు
-గోధుమ పిండి
-యాలకల పొడి
-చక్కెర లేదా బెల్లం పొడి
గోధుమపిండి లడ్డు తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో 1/3 కప్పు నెయ్యి వేయండి. కరుగుతున్న నెయ్యిలో అరకప్పు బొంబాయి రవ్వ(ఉప్మా రవ్వ) వేసి తక్కువ మంట మీద రవ్వను వేయించాలి.
-రవ్వ అంచుల వెంట లేత గోధుమ రంగుమారడం మొదలైనప్పుడు అందులో ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి, 2 టీస్పూన్ల కర్బూజ గింజలు వేసి సన్నని సెగ మీద మొత్తం కలుపుతూ వేయించాలి.
-గోధుమపిండి వేగి ఎరుపు ఎక్కాలి. అప్పటిదాకా తక్కువ మంట మీద కలుపుతూ వేయించాలి.
-పిండి ఎరుపెక్కడం స్టార్ట్ అయినప్పుడు అందులో 3 టేబుల్ స్పూన్ల వేడి పాలు విడతల వారీగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇసుకలా రవ్వ పర్ఫెక్ట్ గా వేగగానే స్టవ్ ఆపేయండి.
-వేయించిన మిశ్రమాన్ని ఒక ప్టేల్ లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఎక్కడైనా గడ్డలుగా ఉండే గరిటతో చిదుముకోండి.
-మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో అర టీస్పూన్ యాలకల పొడి, కప్పుంబావు చక్కెర పొడి లేదా రిఫైన్డ్ షుగర్ లేదా బెల్లం పొడి అయినా వేసుకొని వెళ్లతో నిమురుతూ మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి.
-చివరగా అందులో పావు కప్పు నెయ్యి వేసి మొత్తం బాగా పట్టేలా కలుపుకోండి.
-తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి. పిండి మిశ్రమం కొంచెం కొంచెం చేతుల్లోకి తీసుకుంటూ లడ్డుల్లా మీకు నచ్చిన సైజులో చుట్టుకోండి.
-అంతే టేస్టీ గోధుమపిండి లడ్డూలు రెడీ. ఈ లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే 15 నుండి 20 రోజుల పాటు ఎంతో ఫ్రెష్ గా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
