Latest Updates
-
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.!
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే..
తీయ్యగా, పుల్లపుల్లగా, ఎంతో రసభరితంగా ఉండే ద్రాక్ష పండ్లను చూస్తేనే ఎవరికైనా నోరూరాల్సిందే. మీకు ద్రాక్ష పండ్లు తినడం ఇష్టమైతే, ఆ పండ్లతో చేసే కమ్మని ద్రాక్ష రసం (గ్రేప్ జ్యూస్) కూడా కచ్చితంగా నచ్చుతుంది. బయట మార్కెట్లో దొరికే ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ కలిపిన జ్యూస్ ల కంటే ఇంట్లోనే మిక్సీలొ అప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకునే ద్రాక్ష రసం ఎంతో ఆరోగ్యకరం.
ఈ తాజా పండ్ల రసం త్రాగడం వల్ల అలసిపోయిన శరీరానికి తక్షణ శక్తి లభించడమే కాకుండా, రోజంతా ఎంతో ఉత్సాహంగా, రిఫ్రెషింగ్ గా ఉంటారు. ఐదు నిమిషాల్లో రెండు గ్లాసుల గ్రేప్ జ్యూస్ రెడీ చేసుకోవచ్చు.

ద్రాక్ష రసం తయారీకి కావాల్సిన పదార్థాలు
తాజా ద్రాక్ష పండ్లు: 250 గ్రాములు
చక్కెర: 2 టీస్పూన్లు
నీరు: 1 గ్లాసు
నల్ల ఉప్పు: చిటికెడు
ఐస్ క్యూబ్స్: 4 లేదా 5
ద్రాక్ష రసం తయారు చేసే విధానం
-ముందుగా తీపిగా ఉండే తాజా ద్రాక్ష పండ్లను కాడల నుండి వేరు చేసి ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి పండ్లను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటిపై ఉండే దుమ్ము, క్రిమికీటకాలు పోతాయి.
-శుభ్రం చేసుకున్న ద్రాక్ష పండ్లను జ్యూసర్ లేదా మిక్సీ జార్ లో వేయండి. అందులోనే రుచికి సరిపడా రెండు టీస్పూన్ల చక్కెర, ఒక గ్లాసు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని, దానిపై మందపాటి జల్లెడ పెట్టి ఈ రసాన్ని వడకట్టండి. ఒకవేళ జల్లెడలో ద్రాక్ష గుజ్జు ఇంకా ఎక్కువగా మిగిలిపోయి ఉంటే దాన్ని మళ్లీ మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసి వడకట్టుకోవచ్చు.
-ఇప్పుడు సర్వింగ్ గ్లాసులను తీసుకుని, అందులో ముందుగా రెండు ఐస్ క్యూబ్స్ వేయండి. వడకట్టి పెట్టుకున్న తాజా ద్రాక్ష రసంలో చిటికెడు నల్ల ఉప్పు వేసి బాగా కలపండి. నల్ల ఉప్పు జ్యూస్ కు అద్భుతమైన ఫ్లేవర్ ని ఇస్తుంది. ఇప్పుడు ఈ చల్లటి రసాన్ని గ్లాసుల్లో పోసి పిల్లలకు ఇవ్వండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా త్రాగుతారు. ఇంటికి అకస్మాత్తుగా వచ్చే అతిథులకు స్వాగతం పలకడానికి ఇంతకంటే మంచి రిఫ్రెషింగ్ పానీయం మరొకటి ఉండదు.
-ద్రాక్ష పండ్లు సహజంగానే ఎంతో తీపిగా ఉంటాయి. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు లేదా డైట్ ఫాలో అయ్యే వారు పంచదారను పూర్తిగా మానేయవచ్చు. అయితే జ్యూస్ చేయడానికి మనం ఒక గ్లాసు నీటిని కలుపుతాం కాబట్టి, ఆ సహజమైన తీపి కొద్దిగా చప్పబడుతుంది. అందుకే సాధారణ వ్యక్తులు తీపి కోసం కొద్దిగా పంచదార కలుపుకుంటేనే దాని రుచి మరింత పెరుగుతుంది. కావాలంటే పంచదారకు బదులు తేనె కూడా వాడుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
