Latest Updates
-
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే! -
సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు!
వేడి వేడి అన్నంలోకి అమృతం లాంటి ధనియాల రసం.. ఇలా చేస్తే గిన్నెలు గిన్నెలు తాగేస్తారు!
భోజనం చివర్లో కమ్మటి రసం పడితేనే కానీ కడుపు నిండిన ఫీలింగ్ రాదు. సాంబార్, పప్పు, వేపుళ్లు లాంటివి ఎన్ని ఉన్నా.. రసం లేనిదే దక్షిణ భారతీయుల భోజనం పూర్తి కానట్లే. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో మసాలా వంటకాల కంటే, కడుపుకు హాయినిచ్చే తేలికపాటి ఆహారం తీసుకోవడానికే అందరూ ఇష్టపడతారు. తక్కువ పదార్థాలతో, సులభంగా చేసుకోగలిగే రసం వేసవిలో బెస్ట్ ఆప్షన్.
కూరగాయలు లేకుండానే కేవలం టమాటా, చింతపండుతో మనం రకరకాల రసాలు చేస్తుంటాం. అయితే ఎప్పుడైనా మీరు హోటల్ లో గ్లాసులో వడ్డించే వేడి వేడి రసం తాగి ఆస్వాదించారా? ఆ సువాసన, ఆ ఘాటు తగలగానే.. మరో గ్లాసు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదూ. సరిగ్గా అలాంటి అద్భుతమైన రుచితో, ఘుమఘుమలాడే ధనియాల రసం(కొత్తిమీర గింజల రసం) ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
ధనియాల రసం తయారీకి కావలసిన పదార్థాలు
టమాటాలు - 4 లేదా 5
ఉల్లిపాయ - 1
చింతపండు - చిన్న నిమ్మకాయ సైజు
పచ్చిమిర్చి - 2 లేదా 3
ధనియాలు (కొత్తిమీర గింజలు) - 4 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు -5
కరివేపాకు - రెండు రెమ్మలు
తాజా కొత్తిమీర - కొద్దిగా
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - సరిపడా
పోపు కోసం: నూనె, ఆవాలు, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, బెల్లం
ధనియాల రసం తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో సుమారు లీటరు నీళ్లు పోసి కాస్త వేడెక్కాక అందులో టమాటాలు, చింతపండు, కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. అలాగే జీలకర్ర, ధనియాలు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి.
-గిన్నెపై మూత పెట్టి ఈ మిశ్రమాన్ని కనీసం 5 నుంచి 7 నిమిషాల పాటు మీడియం మంట మీద బాగా ఉడికించాలి. టమాటాలు పూర్తిగా మెత్తబడేవరకు ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక జల్లెడ లేదా ఫిల్టర్ సహాయంతో ఉడికించిన నీటిని వేరు చేయాలి. జల్లెడలో మిగిలిన టమాటా, ధనియాల మిశ్రమాన్ని చేత్తో బాగా పిసికి (మ్యాష్ చేసి) అందులో ఉన్న రసాన్ని మొత్తం తీసి, ముందుగా పక్కన పెట్టుకున్న నీటిలో కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. చివరగా చిటికెడు ఇంగువ వేయండి.
-ఇప్పుడు ఈ తాలింపులో సిద్ధం చేసుకున్న ధనియాలు-టమాటా రసం నీటిని పోయాలి. రుచి చూసుకుని సరిపడా ఉప్పు, ఓ చిటికెడు బెల్లం వేయాలి. తక్కువ మంట మీద ఒక్క పొంగు వచ్చే వరకు మాత్రమే మరిగించాలి. చివరగా సన్నగా తరిగిన పచ్చటి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేస్తే సరిపోతుంది.
-అంతే.. ఎంతో రుచికరమైన ధనియాల రసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






