Latest Updates
-
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ!
చపాతీ, నాన్, జీరా రైస్ లోకి అమృతంలాంటి నవరతన్ కుర్మా.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!
రోజువారీ వంటకాలతో విసిగిపోయారా? ఏదైనా స్పెషల్ గా అదిరిపోయే రుచితో పాటు, చూడటానికి రాజసంగా కనిపించే వంటకం చేయాలనుకుంటున్నారా? అయితే నవరతన్ కుర్మా మీకు బెస్ట్ ఛాయిస్. తాజా కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, పనీర్, మఖానా కలగలిసిన ఈ క్రీమీ వంటకం పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఫిదా చేస్తుంది.

నవరతన్ కుర్మా తయారీకి కావాల్సినవి
-ఉల్లిపాయ
-అల్లం
-వెల్లుల్లి
-పచ్చిమిర్చి
-జీడిపప్పు
-బాదం
-ఎండుద్రాక్ష
-స్వీట్ కార్న్
-పచ్చి బఠాణీలు
-బిర్యానీ ఆకు
-దాల్చిన చెక్క
-నల్ల యాలకలు
-యాలకలు
-కొత్తిమీర
-ఉప్పు
-క్యారెట్
-క్యాలీఫ్లవర్
-ఫ్రెంచ్ బీన్స్
-మఖానా
-గరం మసాలా
-కసూరిమేతి
-చక్కెర
-నూనె లేదా నెయ్యి
రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్.. ఇంట్లోనే పక్కా లోకల్ ఫ్లేవర్ తో ఇలా చేసేయండి!
నవరతన్ కుర్మా తయారీ విధానం
-దీనికోసం ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా పెద్దగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీడిపప్పు, బాదం తీసుకోవాలి. వాటికి బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, పెద్ద,చిన్న యాలకులు, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు వేసి అవన్నీ మునిగేలా వేడి నీళ్లు పోయాలి. మూతపెట్టి మీడియం మంటపై 15 నిమిషాల పాటు బాగా ఉడికించి, చల్లారనివ్వాలి.
-ఇప్పుడు క్యారెట్, క్యాలీఫ్లవర్, ఫ్రెంచ్ బీన్స్ వంటివి ఒకే సైజులో చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు మరిగించి ఉప్పు వేసి తరిగిన కూరగాయలతో పాటు స్వీట్ కార్న్, పచ్చి బఠానీలు వేసి 3 నుంచి 4 నిమిషాలు ఉడికించాలి. ఆ వెంటనే నీళ్లన్నీ వడకట్టి ఒక గిన్నెలో వేరుగా పెట్టుకుంటే.. వాటి రంగు, కరకరలాడే గుణం చెక్కుచెదరకుండా ఉంటాయి.
-ఉడికించి పెట్టుకున్న గ్రేవీ మిశ్రమం చల్లారాక, అందులోని బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, నల్ల యాలకులు తీసేయాలి. మిగిలిన మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తటి క్రీమ్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక పాన్ లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేడి చేసి.. సగానికి కోసిన జీడిపప్పు, ఎండుద్రాక్ష, మఖానాలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్ లోకి గ్రైండ్ చేసుకున్న గ్రేవీ పేస్ట్ ను వడకట్టుకుంటూ వేయాలి. కొద్దిగా వేడినీళ్లు పోసి సన్నని మంటపై 3-4 నిమిషాలు ఉడికిస్తే గ్రేవీ స్మూత్ గా మారుతుంది. ఆ తర్వాత ముందుగా ఉడికించిన కూరగాయలు, వేయించిన డ్రై ఫ్రూట్స్, మఖానా, పనీర్ ముక్కలు, మీకు ఇష్టమైన పండ్ల ముక్కలు వేయాలి. దీనికి ఫ్రెష్ క్రీమ్, వెన్న, తెల్ల మిరియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి వేసి నెమ్మదిగా కలపాలి. రుచికి తగినంత ఉప్పు, రుచులను బ్యాలెన్స్ చేయడానికి చిటికెడు చక్కెర వేసి మరో 3 నిమిషాలు ఉడికించాలి.
-స్టవ్ ఆపేసినప్పుడు గ్రేవీ కొద్దిగా పలచగా అనిపించినా ఆందోళన వద్దు. అందులో ఉన్న జీడిపప్పు వల్ల కాసేపటికి అదే సరైన చిక్కదనానికి వస్తుంది.
-అంతే నోరూరించే ఘుమఘుమలాడే నవరతన్ కుర్మా రెడీ. వేడి వేడి బటర్ నాన్, తందూరి రోటీ, పరాఠా లేదా జీరా రైస్‌తో దీనిని వడ్డిస్తే అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
