Latest Updates
-
మగవారికి షాకింగ్ న్యూస్.. మీ శరీరంలో ఈ హార్మోన్ లెవెల్స్ పడిపోవడం గమనిస్తున్నారా.? -
ఆలయాల్లో దేవతలను మేల్కొలిపే సుప్రభాతం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం -
ప్రెగ్నెన్సీ సమయంలో యోగా, స్ట్రెచింగ్ చేయవచ్చా.?.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.! -
పరగడుపున నానబెట్టిన మెంతులు తింటే.. ఈ 5 అద్భుత ప్రయోజనాలు మీ సొంతం! -
గుడ్డిగా నమ్మి మోసపోకండి.. రిలేషన్ షిప్స్ పై చాణక్యుడి 6 హెచ్చరికలు -
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఉద్యోగులు ఏ నగరాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసా.! -
చికెన్, మటన్ కూడా దీని ముందు బలాదూర్.. స్పైసీ మష్రూమ్ చుక్కా రుచి చూశారా? -
ముఖం, జుట్టు జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుందా.. భారీ వర్షాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
ప్రైవేట్ పార్ట్స్ లో హెయిర్ తీయడానికి ఏ పద్ధతి బెస్ట్? -
అలా అయితేనే పెళ్లి చేసుకోండి.. రిలేషన్‌షిప్‌పై అమ్మాయిలకి సమంత పవర్ఫుల్ అడ్వైజ్.!
రెస్టారెంట్ రుచితో కరకరలాడే షెజ్వాన్ చికెన్ లాలీపాప్.. మీ ఇంట్లోనే చేసేయండిలా..
నాన్ వెజ్ ప్రియులకు స్పైసీగా, కరకరలాడే చికెన్ స్టార్టర్స్ ఉంటే ఆ మజాయే వేరు. చైనీస్ వంటకాల్లో ఎంతో పాపులర్ అయిన షెజ్వాన్ చికెన్ లాలీపాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది కేవలం ఆకలిని తీర్చడమే కాదు, ఇంట్లో చిన్నపాటి పార్టీలు చేసుకున్నప్పుడు అతిథులను ఇట్టే ఆకర్షిస్తుంది. బయట రెస్టారెంట్లలో ఎంతో ఇష్టంగా తినే ఈ జ్యూసీ అండ్ క్రంచీ చికెన్ లాలీపాప్ ఇప్పుడు మీ ఇంట్లోనే చాలా సులభంగా, హైజీనిక్ గా తయారు చేసుకోవచ్చు.

షెజ్వాన్ చికెన్ లాలీపాప్ తయారకి కావలసిన పదార్థాలు
చికెన్ లాలీపాప్స్ - అర కిలో
గుడ్డు - 1
స్ప్రింగ్ ఆనియన్స్ (ఉల్లికాడలు) - 1 కప్పు
షెజ్వాన్ సాస్ - తగినంత
రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ - తగినంత
లైట్ సోయా సాస్ - 2 టీస్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి - కొద్దిగా
ఉప్పు, కారం - రుచికి సరిపడా
మైదా పిండి - తగినంత
బియ్యం పిండి - తగినంత
కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 3 లేదా 4
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

షెజ్వాన్ చికెన్ లాలీపాప్ తయారీ విధానం
-ముందుగా చికెన్ లాలీపాప్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక బౌల్లో తీసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, కొద్దిగా కారం, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో అసలైన రుచినిచ్చే షెజ్వాన్ సాస్ కూడా వేసి ముక్కలకు పట్టించి, కనీసం అరగంట పాటు పక్కన మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్క లోపల వరకు జ్యూసీగా మారుతుంది.
- ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ మిశ్రమంలో ఒక గుడ్డు పగులగొట్టి వేయాలి. దీనికి కొద్దిగా కార్న్ ఫ్లోర్, మైదా, అలాగే మంచి క్రంచ్ కోసం కొద్దిగా బియ్యం పిండి వేసి పిండి అంతా ముక్కలకు పర్ఫెక్ట్గా కోట్ అయ్యేలా కలుపుకోవాలి.
- స్టవ్ మీద కడాయి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా కాగాక, కోట్ చేసుకున్న చికెన్ లాలీపాప్స్‌ను ఒక్కొక్కటిగా వేస్తూ మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. లోపల చికెన్ ఉడికేలా, బయట గోల్డెన్ బ్రౌన్ కలర్ (బంగారు వర్ణం) వచ్చే వరకు కరకరలాడేలా వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు మరో వెడల్పాటి పాన్ తీసుకుని రెండు స్పూన్ల నూనె వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత ఉల్లికాడలు, గ్రీన్ చిల్లీ సాస్, షెజ్వాన్ సాస్ వేసి సాస్ మాడకుండా కలుపుతూ కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. గ్రేవీ చిక్కబడటం కోసం ఒక చిన్న కప్పులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ తీసుకుని, నీళ్లు కలిపి ఉండలు లేకుండా చేసి, ఆ మిశ్రమాన్ని మరుగుతున్న సాస్‌లో పోయాలి. దీంతో సాస్ చిక్కగా, నిగనిగలాడుతూ రెస్టారెంట్ స్టైల్ లో తయారవుతుంది.
-చివరగా ఈ వేడి వేడి, స్పైసీ సాస్ మిశ్రమంలో ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ వేసి బాగా టాస్ చేయాలి. గ్రేవీ అంతా ముక్కలకు పట్టి, మెరుస్తూ తయారయ్యే వరకు ఒక నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
-అంతే ఘుమఘుమలాడే షెజ్వాన్ చికెన్ లాలీపాప్' రెడీ. దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకుని, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్కతో వడ్డిస్తే ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications