Latest Updates
-
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
డియోడరెంట్లతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు.! -
సాయంత్రం సమయంలో ఇంట్లో చేసే ఈ తప్పులు ఆర్థిక సమస్యలకి దారితీస్తాయని తెలుసా.! -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. పదే నిమిషాల్లో శ్రీరంగం టెంపుల్ స్టైల్ ‘జీరా’ ప్రసాదం రెడీ.! -
కేవలం 10 నిమిషాల్లో స్పాంజి లాంటి టమాటో దోసె.. ఎలా చేయాలో చూడండి! -
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి..చెత్తను దిగుమతి చేసుకుంటున్న దేశం ఏదో తెలుసా? -
వారం రోజుల పాటు రీల్స్, సినిమాలు చూడటం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా.? -
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.! -
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్‌తో ఇలా ఈజీగా చేసేయండి.!
రోడ్ సైడ్ టిఫిన్ సాంబార్..ఏం రుచిరా బాబు కేక అంతే..10 నిమిషాల్లో మీ ఇంట్లో చేసుకోండిలా..
మనలో చాలామందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే గుర్తొచ్చేవి ఇడ్లీ, దోశ. అయితే ఈ టిఫిన్స్ ఎంత రుచిగా ఉన్నా, వాటికి సరైన సాంబార్ తోడైతేనే ఆ మజాయే వేరు. ముఖ్యంగా రోడ్ సైడ్ తోపుడు బండి దగ్గర దొరికే టిఫిన్స్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఆ బండి దగ్గర వేడి వేడి ఇడ్లీల పైన నీళ్లలా ఉండే సాంబార్ పోసుకుని తింటే ఆ రుచి అద్భుతం. చూడ్డానికి పలుచగా కనిపించినా.. రుచిలో మాత్రం దీనికి సాటి మరొకటి ఉండదు. ఎంతో రుచికరమైన ఈ సాంబార్‌ను మన ఇంట్లోనే చాలా సులభంగా, కేవలం 10 నుండి 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.

రోడ్డు సైడ్ టిఫిన్ సాంబార్ తయారీకి కావాల్సిన పదార్థాలు
సాంబార్ ఉల్లిపాయలు- అర కప్పు
టమాటాలు - 2
కందిపప్పు - పావు కప్పు (కనీసం 10-15 నిమిషాలు నానబెట్టుకోవాలి)
పసుపు - పావు టీస్పూన్
నీళ్లు - 1.5 కప్పులు
ఉప్పు - 1 టీస్పూన్
సాంబార్ పొడి - 3 టీస్పూన్లు
సోంపు - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 3
వేపిన శనగపప్పు (పుట్నాల పప్పు) - 3 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా
రోడ్డు సైడ్ టిఫిన్ సాంబార్ తయారీ విధానం
-ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. అందులో అర కప్పు చిన్న ఉల్లిపాయలు, రెండు టమాటాలు, ముందుగానే 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న పావు కప్పు కందిపప్పు వేయాలి. అందులోనే పావు టీస్పూన్ పసుపు, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టండి. స్టవ్ వెలిగించి మీడియం మంట మీద 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు, పప్పు మెత్తగా ఉడికేలా చూసుకోవాలి.
-కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి, ఉడికిన మిశ్రమాన్ని పప్పుగుత్తితో మెత్తగా మాష్ చేసుకోవాలి. పలుకులు లేకుండా గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినట్లుగా ఉప్పు, 3 టీస్పూన్ల సాంబార్ పొడి వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
- ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక టీస్పూన్ సోంపు, 3 పచ్చిమిర్చి, 3 టేబుల్ స్పూన్ల వేపిన శనగపప్పు (పుట్నాలు) వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ను ముందుగా ఉడకబెట్టుకున్న సాంబార్ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి, సాంబార్ ను పచ్చి వాసన పోయేంత వరకు బాగా మరిగించాలి.
- సాంబార్ కాస్త చిక్కబడుతున్నట్లు అనిపిస్తే, టిఫిన్ సాంబార్ అంటేనే పలుచగా ఉంటుంది కాబట్టి, మీకు కావలసిన కన్సిస్టెన్సీ కోసం మరికొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. ఇలా నీళ్లు పోశాక మరో 2 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే రోడ్డు సైడ్ టిఫిన్ సాంాబార్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications