Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
బాసుంది-స్పెషల్ స్వీట్ : ఈద్ స్పెషల్
ముస్లీంలకు అత్యంత ఇష్టమైన మరియు పవిత్రమైన పండుగ ఈద్ మరికొద్దిరోజుల్లో రాబోతున్నది. ఇప్పటికే ఈద్ షాపింగ్ ను మొదలు పెట్టేసే ఉంటారు. ఈద్ గురించి మాట్లాడేటప్పుడు, ఒక్క ఫుడ్ గురించి మాత్రమే ఆలోచన పోతుంది. ముఖ్యంగా స్వీట్స్ అండ్ సావరీస్ . అందులో సేవియా, షీర్ కుర్మా, షహీ తుక్కడా మొదలైనవి. మరి మీరు కూడా స్వీట్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటే, ఈ ఫెస్టివల్ సీజన్ ను సెలబ్రేట్ చేసుకోండి. అయితే కొత్త వంటలను ప్రయత్నించడం ఎలా ?
బాసుంది ఒక స్పెషల్ ఈద్ స్వీట్ రిసిపి. ఇది చాలా వరకూ ఖీర్ లాగే ఉంటుంది. పాలు, బియ్యంపిండితో చాలా సులభంగా తయారుచేస్తారు. డ్రై ఫ్రూట్స్ గార్నిష్ తో తయారుచేసే ఈ స్వీట్ రిసిపి పిల్ల పెద్దలందరికి చాలా ఇష్టమైనటువంటి స్వీట్ రిసిపి మరి మీరు కూడా టేస్ట్ చూడాలంటే తయారుచేసే సింపుల్ విధానాన్ని తెలుసుకోవాల్సిందే.....

కావల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్ : 1cup
పాలు: 1/2lts
కండెన్డ్స్ మిల్క్: 1/2cup(పాలను బాగా మరిగించి మీగడ తీసిన పాలు)
జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్ నట్స్ మరియు ద్రాక్ష: 2tbsp(సన్నగా కట్ చేసుకోవాలి)
నూనె: 1tbsp
పంచదార: 8tbsp
గోరువెచ్చని పాలలో చిటికెడు కుంకుపువ్వు నానబెట్టుకోవాలి.
తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యంను నీళ్ళలోవేసి శుభ్రంగా కడిగి, 4-5గంటలు పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీరు వంపేసి రఫ్ గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అరకప్పు నీటిని పాన్ లో పోసిన మరిగించాలి. తర్వాత అందులో రుబ్బిపెట్టుకొన్న బియ్యం పిండిని వేయాలి. 5నిముషాలు మీడియం మంట మీద ఉడికించాలి.
2. తర్వాత అందులో పాలు కూడా పోసి నిధానంగా కలియబెడుతూ, బియ్యంపిండి పాత్రఅడుగు అంటకుండా చూడాలి. అలాగే నెయ్యి వేసి మిక్స్ చేయాలి.
3. ఇలా ఒక్కసారి రైస్ ను ఉడికించుకొన్న తర్వాత, అందులోనే పంచదార కూడా వేసి మరో రెండు నిముషాలు మిక్స్ చేసి ఉడికించుకోవాలి.
4. మొత్తం పదార్థాలన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి.
5. తర్వాత అందులో ముందుగా కుంకుమపువ్వు నానబెట్టిన పాలను కూడా పోసి బాగా మిక్స్ చేయాలి.
6. చివరగా కట్ చేసి రోస్ట్ చేసి పెట్టుకొన్న నట్స్ ను గార్నిషింగ్ గా వేసి బాగా మిక్స్ చేయాలి . అంతే కలర్ ఫుల్ స్వీట్ బాసుంది రెడీ. అంతే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేయడమే ఆలస్యం . బాసుందిని చల్లగా లేదా వేడిగా కూడా సర్వ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications