Latest Updates
-
కరకరలాడే బెండకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి రుచిచూస్తే వదలరు! -
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్!
చిరోటి స్వీట్ పూరి

మైదా: 1cup
చెక్కర: 1cup
నెయ్యి: 4tbsp
బియ్యప్పిండి: 2tbsp
ఉప్పు: చిటికెడు
నూనె: వేయించడానికి సరిపడా
నీరు: పిండి కలపడానికి
తయారు చేయు విధానము:
1. ఒక గిన్నె లో మైదా వేసుకోవాలి. అందులోకి చిటికెడు ఉప్పు వేయాలి.
2. తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. తర్వాత పిండిని బాగా కలిపి కొద్దిగా నీరు పోసి, పూరి పిండిలా కలపాలి.
3. ఇప్పుడు కలిపిన పిండిని మూత పెట్టి, 30 నిముషాలు నాననివ్వాలి. పిండి నాని తర్వాత మృదువుగా మెత్తగా అవుతుంది.
4. ఇప్పుడు ఆ నానిన పిండిని 5 సమ భాగాలుగా ఉంటలు చేసుకోవాలి. తర్వాత చపాతి పీటపై ఉంటను పెట్టి చపాతీలా చేసుకోవాలి.
5. అన్ని ఉంటలను చపాతీలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
6. తర్వాత ఒక చిన్న గిన్నెలో 2 స్పూన్స్ బియ్యప్పిండి రెండు స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు ఈ బియ్యప్పిండి మిశ్రమాన్ని చపాతీలపై రాయాలి.
8. మరొక చపాతీ తీసుకొని మొదటి చపాతికి కొద్దిగా కింద పెట్టి దానికి కూడా బియ్యప్పిండి మిశ్రమాన్ని రాయాలి. ఇలా అన్నీ చపాతీలు ఒకదాని కింద ఒకటి పెట్టి ప్రతీ చపాతీకి బియ్యప్పిండి మిశ్రమాన్ని పూయాలి.
9. తర్వాత దీనిపై కొంచెం మైదా చిలకరించి మిశ్రమాన్ని పూసిన చపాతీలను చివరి నుంచి చాపలా గుండ్రంగా చుట్టాలి. ఇలా చుట్టిన పిండిని చపాతి పీటపై పెట్టకోవాలి.
10. తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ముక్కలుగా కట్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్క ముక్కను పూరీలా వత్తుకోవాలి, అన్నీ ముక్కలను పూరీలా వత్తుకొని పక్కన పెట్టుకోవాలి.
11. ఇప్పుడు చెక్కర పాకం సిద్దం చేసుకొని..ఈ పూరిలను వేడినూనెలో వేసి కొద్దిగా ఎర్రగా కాలిన వెంటనే పాకంలో వేయాలి ఒక నిమిషం తర్వాత తీసి ప్లేట్ లో పెట్టి సర్వ్ చేయాలి అంతే చిరోటి స్వీట్ పూరి రెడీ..



Click it and Unblock the Notifications