Latest Updates
-
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట!
కోవా కోకనట్ బర్ఫీ: శ్రావణ మాసం స్వీట్స్
ఫుడ్ లవర్స్ కు ఈ వారం ఒక బెస్ట్ వీక్ అని చెప్పవచ్చు . ఎందుకంటే, పండుగలు వెంట వెంటనే ఒక దాని తర్వాత మరొకటి వస్తున్నాయి. వరమహాలక్ష్మీ వ్రతం, రాఖీపండుగ, ఓనమ్.
కాబట్టి, ఈ ఫెస్టివ్ సీజన్ లో ఒక్కోరోజు ఒక్క కొత్త రుచిని ఆస్వాదిస్తుంటారు కాబట్టి, చాలా సింపుల్ గా మరియు టేస్టీగా, ఈజీగా తయారయ్యే స్వీట్ డిష్ ను ఈ రోజు మీకోసం అందిస్తున్నాయి . మరి దీన్ని ఎలా తయారుచేయాలో అందుకు ఏం ఏం అవసరం అవుతాయో తెలుసుకుందాం...

కావల్సిన పదార్థాలు:
కొబ్బరి (తురుము) - 1 cup
కోవ - 1 cup
పాలు - 1 cup
మిల్క్ పౌడర్ - 1tbsp
షుగర్ -1cup
యాలకలు - 1/4 tbsp
నెయ్యి - 4 to 5tbsp
తయారుచేయు విధానం:
1. పాన్ లో నెయ్యి, కొబ్బరి తురుము వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత మరో పాన్ లో కోక మరియు ఒక కప్పు షుగర్ వేసి మిక్స్ చేస్తూ కరిగించాలి.
3. ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసుకొన్న కొబ్బరి తురుము మరియు ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసి మిక్స్ చేయాలి.
4. ఇప్పుడు ప్లేట్ తీసుకొని అందులో రెండు చెంచాల నెయ్యి వేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి.
5. ఇప్పడు పాన్లో ఉడుకుతున్న మిశ్రమాన్ని వేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి.
6. కొద్దిగా చల్లారిన తర్వాత చేతిలోనికి నిమ్మకాయంత తీసుకొని ఉండలు చుట్టుకోవచ్చు. లేదా చాకుతో చతురస్రాకారంలో మీకు కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవచ్చు. అంతే కోక కోకనట్ బర్ఫీ రెడీ..



Click it and Unblock the Notifications