Latest Updates
-
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్!
ఎగ్ బోండా: ఈవినింగ్ స్నాక్
సాధారణంగా ఏఇంట్లో అయినా సరే వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ తో పాటు గుడ్లు కూడా ఫ్రిజ్ లో స్టాక్ ఉంటాయి. ఎందుకంటే గుడ్డుతో తయారుచేసే వంటలు చాలా సులభంగా మరియు మరియు హెల్తీగా మరియు టేస్టీగా తయారుచేసుకోవచ్చు. మీరు కాలేజ్ లేదా ఆఫీస్ నుండి తిరిగి రాగానే మీరు ఒక టేస్టీ అండ్ ఈజీ స్నాక్ చేసుకోవాలంటే గుడ్డుతో తయారుచేసేకోండి.
గుడ్డుతో తయారుచేసే వంటలు చాలా ఉన్నాయి. అందులో చాలా సింపుల్ గా తయారుచేసేవి కూడా ఉన్నాయి. ఉదా: ఎగ్ బుర్జ్. ఆమ్లెట్ వంటి 10నిముషాల లోపలే తయారుచేసేయవచ్చు. అలాగే ఇండియన్ ఎగ్ పరోటా తయారుచేయడానికి కొంత సమయం తీసుకుంటుంది. పరోటో, ఎగ్ బిర్యానీ, ఎగ్ కర్రీ వీటిని చేసేకంటే త్వరగా తయారయ్యే ఎగ్స్ స్నాక్స్ తయారుచేసుకోవడం మంచిది. అంతే కాదు స్నాక్స్ టేస్టీగా మరియు క్రీస్పీగా ఉంటాయి. మరి ఈ ఈవెనింగ్ రిసిపిగా ఎగ్ బోండా ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 5
శెనగపిండి: 1/2cup
కారం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1cup
తయారుచేయు విధానం:
1. ముందుగా గుడ్లను ఉడికించి తర్వాత ఔటర్ షెల్ తొలగించి పక్కన పెట్టుకోవాలి. అవసరం అయితే మీరు ఒక గుడ్డును రెండుగా కట్ చేసుకోవచ్చు. లేదా పూర్తిగా ఒక గుడ్డు కావాలనుకుంటే అలాగే ఉపయోగించుకోవచ్చు.
2. ఒక మిక్సింగ్ బౌల్లో శెనగపిండి, నీళ్ళు, కారం, మరియు ఉప్పు వేసి, చిక్కగా, కొత్తిగా జారుడుగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి, మీడియం మంట మీద కాగనివ్వాలి, తర్వాత ఉడికించి పక్కన పెట్టుకొన్న గుడ్డును శెనపిండిలో డిప్ చేసి గుడ్డుకు బాగా అంటుకొనేలా చేయాలి.
4. ఇప్పుడు కాగుతున్న నూనెలో వేయాలి. మంటను తగ్గించి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ డీప్ ఫ్రై చేసుకోవాలి . మద్యమ్యదలో వాటిని తిరగేస్తుండాలి .
5. ఎగ్ బోండా ఫ్రై అయినట్లు అనిపిస్తానే వాటీని నూనె నుండి వేరుచేసి తీసి సర్వింగ్ బౌల్ లేదా సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకోవాలి. ఇలా మొత్తం గుడ్లును తయారుచేసుకొన్న తర్వాత అదనంగా ఆయిల్ ఉన్నట్లు మీరు గమనించినట్లైతే పేపర్ టవల్ మీద వేసి అదనపు నూనె పీల్చుకొనేలా చేయాలి. అంతే ఎగ్ బోండా రెడీ. అంతే ఈ ఎగ్ బోండాను టమోటో కెచప్ లేదా కోరియాండర్ చట్నీతో సర్వ్ చేయాలి .



Click it and Unblock the Notifications











