Latest Updates
-
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్! -
అకస్మాత్తుగా ధనలాభం..మే 10న ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది!
‘గణేష్ మహరాజ్’ను కాకా పట్టండిలా...!!

'ఉత్తర భారతదేశం'లో గణనాథుని పండుగను అతి పవిత్రంగా జరుపుకుంటారు. వీరి పూజలో 'మోదక్' వంటంకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
గణనాథునికి ఇష్టమైన 'మోదక్ లను' నైవేద్యంగా పెడితే తాము కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. గణపతి స్వామికి ఇష్టమైన ఈ మోదక్ వంటకాన్ని రెండు పద్దతుల్లో తయారు చేసుకోవచ్చు. ఒకటి ఉడకపెట్టడం, రెండో విధానం వేయించడం. సులవైన విధానంలో ఈ వంటకాలను తయారు చేసుకోవచ్చు..
మోదక్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం:
- మైదా 2 కప్పులు,
- 2 టేబుల్ స్పూన్ల బియ్యపు రవ్వ,
- తగినన్ని నీళ్లు,
- నూనె సరిపడా,
- సాల్ట్ తగినంత,
- బెల్లం 1 కప్పు (చిదిమినది),
- కొబ్బరి 1 కప్పు (తురుమినది),
- ఏలుకుల పొడి 1/2 టీస్పూన్,
- నెయ్యి 1 1/2 టేబుల్ స్పూన్
తయారీ విధానం చూద్దాం:
- ముందుగా మైదాలో, బియ్యపు రవ్వను కలిపి ఆ మిశ్రమానికి తగినంత నీటితో పాటు తగినంత ఉప్పును జోడించి మొత్తగా పిసుక్కోవాలి.
- అనంతరం బాండీలో నూనెను పోసి వేడిచేసుకుండి. నూనె వేడెక్కిన తరువాత చిదుముకున్న బెల్లం, తరిగిన కొబ్బరి, ఏలుకల పొడితో నెయ్యిను కలిపి 10 నిమిషాల పాటు వేడిచేయండి. తయారైన పాకాన్ని దించుకుని చల్లబడేంత వరకు పక్కన పెట్టండి.
- మొత్తగా కలుపుకుని పెట్టకున్న మైదా మిశ్రమాన్ని, చిన్న చిన్న వుండలుగా చేసుకుని అప్పచ్చిలా రోల్ చేసుకోండి
- ఇలా అప్పచ్చిలా చేసుకున్న మైదా పదార్థం మధ్యలో, చల్లబడని పాకాన్ని ఇక టీ స్పూన్ పెట్టి అన్ని వైపుల నుంచి మూసేయండి.
- ఇలా తయారు చేసుకున్న'మోదక్'లను బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి, వినాయకునికి నైవేద్యంగా పెట్టండి.
"స్వామి పూజ అనంతరం వీటినేతిలో నంచుకుని తింటే రుచిగా ఉంటాయి".



Click it and Unblock the Notifications