Latest Updates
-
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా?
హైదరాబాదీ సమోసా వంటకం

గోధుమపిండి: 2cups
ఉప్పు: చిటికెడు
ఉల్లిపాయ తరుగు: 1cup
ఉల్లికాడల తరుగు: 1cup
పచ్చిమిర్చి: 6-8
క్యాబేజీ తురుము: 1/4cup
క్యారెట్ తురుము:1/4cup
పసుపు : చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర: కొద్దిగా
నూనె: కావలసినంత
తయారు చేయు విధానం:
1. గోధుమపిండిలో ఉప్పు వేసి, నీటితో చపాతీ పిండిలా కలుపుకోవాలి.
2. స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి, వేడయ్యాక ఉల్లితరుగు, ఉల్లికాడల తరుగు, పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకూ వేయించాలి. తర్వాత తరిగిన క్యాబేజీ, క్యారట్, తగినంత ఉప్పు పసుపు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి.
3. ఐదు నిమిషాల తర్వాత తడిలేకుండా వేయించుకొని అందులో కొత్తిమీర తరుగు చల్లుకొని దింపేసుకోవాలి.
4. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న పిండి కాస్త మెత్తబడి ఉంటుంది. దీన్నీ కొద్దికొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పలుచగా చపాతీల సైజులో వత్తుకోవాలి.
5. పెనం వేడిచేసి వేడి చేసి ఈ చపాతీని రెండు వైపులా కొద్దిగా వెచ్చబెట్టి తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చపాతీలను రెండు అంగుళాల వెడల్పులో నిలువుగా రిబ్బనులా కట్ చేసుకోవాలి. ఒక కొనవైపు కొద్దిగా ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టి త్రికోణంలా మడుస్తూ పోవాలి.
6. మొత్తం సమోసాని త్రికోణంలా మడిచాక అంచులు తడిచేసి విడిపోకుండా ఒత్తి మూసేయాలి. ఇలా అన్నీ సమోసలు రెడీ చేసుకొన్నాక స్టౌ పై పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక సమోసలను అందులో వేసి కరకరలాడేలా వేయించి పక్కకు తీసుకొని సాస్ తో సర్వ్ చేయాలి. అంతే హైదరాబాదీ సమోసా రెడీ.



Click it and Unblock the Notifications











