Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
సమ్మర్ స్పెషల్ - మ్యాంగో లడ్డు
సమ్మర్ స్పెషల్ అంటేనే మామిడికాయల సీజన్ చాలా మందికి మామిడి పండ్లన్నా..కాయలన్నా చాలా ఇష్టం అంతే కాదు. వేసవి కాలంలో ఎండ వేడి చిరాకు పెట్టించినా... మామిడి పండ్ల తియ్యదనం, కాయల పచ్చడి రుచులు గుర్తుకురాగానే ఆ వేడి చల్లగా పక్కకు జారుకుంటుంది. మామిడి పండును రొటీన్‌గా ముక్కలు కోసుకుని తినడమో, రసం తీసుకుని తాగడమో కాకుండా వెరైటీగా లడ్డు తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది...
పండ్ల రారాజు మామిడి పండు, వేసవి వచ్చేసింది పచ్చిమామిడికాయలు అక్కడక్కడ దర్శినమిచ్చేస్తున్నాయి. అయితే ఇక పండువి కూడా మార్కెట్లో దిగేస్తాయన్నమాట. మరో రెండు మూడు నెలలు మామిడి పండ్ల సీజన్. మామిడి పండ్లంటే అందరీ చాలా ఇష్టం వాటి వాసన, రుచి, రంగు ఇట్టే ఆకర్షించేస్తాయి. అంతే కాదండోయ్ వీటిలో ఆరోగ్యప్రయోజనాలు కూడా ఎక్కువే. ప్రతి రోజూ ఒక మామిడి పండును తీసుకోవడం వల్ల హెల్తీ డైట్ పూర్తవుతుంది. ఇవి మీ డైట్, మరియు టేస్ట్ ను ఫుల్ ఫిల్ చేయడం మాత్రమే కాదు అనేక స్కిన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది ఆశ్చర్యమే కావచ్చు. అయితే ఇది మాత్రం నిజం.

కావలసిన పదార్థాలు:
మామిడిపండ్లు : 2
పంచదారపొడి : 150grms
ఏలకులపొడి : 1/2tsp
నెయ్యి : 1/2cup
శనగపిండి : 300grm
జీడిపప్పు + ఎండుద్రాక్ష : పావుకప్పు
తయారు చేయు విధానం:
1. ముందుగా మామిడిపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నెయ్యి వేసి కాగాక, శనగపిండి వేసి దోరగా వేయించాలి.
3. ఇప్పుడు వెడల్పాటి పళ్లెంలో... వేయించిన శనగపిండి, పంచదారపొడి, ఏలకులపొడి వేసి బాగా కలిపి, ముందుగా తీసిపెట్టుకున్న మామిడిరసాన్ని చేర్చి, బాగా మెత్తగా తయారు చేసుకోవాలి.
4. తర్వాత చేతికి కాస్త నెయ్యి రాసుకుంటూ, ఈ మిశ్రమాన్ని లడ్డూల్లా చేసుకోవాలి.
5. ఈ లడ్డుల మీదకు వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్షలను అక్కడక్కడా అలంకరిస్తే చాలు, ఎంతో రుచికరమైన లడ్డు తయారయినట్లే.



Click it and Unblock the Notifications