Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కేరింతల రంగుల హోళీ.. కమ్మని చక్కర కేళీ
హోలీ విశ్వవాప్తంగా అద్భుతంగా జరుపుకొనే రంగుల పండుగ. ఈ పండుగా రోజున, తేజం, వివిధ తరంగాలు, విశ్వవ్యాప్తంగా ప్రకాశిస్తాయి. అక్కడ వివిధ రకాల రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషం. పురాణ కథలతో పాటుగా హోళి పండుగ వెనుక మరో పరమార్థం ఉంది. హోళీ పండుగను వసంత బుతువు ఆగమనంగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది చలికాలం తొలగిపోయి ఎండకాలం ఆరంభానికి నాంది ప్రస్థానం వంటిది.
హోళీ పండుగను సాధారణంగా పాల్గుణ పౌర్ణమి' రోజున జరుపుకుంటారు. ఇలా ఓ రుతుబు వెళ్ళి మరో రుతువు చ్చే సమయంలో ముఖ్యంగా శీతాకాలం‘చలి పోయి' ఎండాకాలం ‘వేడి' వచ్చే సమయంలో ఉష్ణోగ్రతల తేడా వల్ల చర్మం చిట్లుతుంది. రంగులు ఆ చిట్లటం వల్ల కలిగే చికాకును తగ్గిస్తాయని నమ్మకం.
ప్రపంచంలోని రంగులన్నీ ఒకచోట చేర్చారా అన్నంత ఆందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా జరిపుకొనే హోళీ అంటే చిన్నా, పెద్దా అందరికీ ప్రియమే...! వయస్సుతో భేదం, ఆడ, మగా అన్న తేడా లేకుండా అందరూ కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. మరి ఇటువంటి హోళీ రోజును కలర్ ఫుల్స్ స్వీట్ తోడైతే ఆ ఆనందాలకు అడ్డు ఏమి.. వచ్చిన బందువులతో హోళీ రంగు కేళీ.. జయహోళీ అవుతుంది. ఆడితే ఎలా ఆడాలీ?రంగుల వీధుల్లో ఈతకొట్టాలి.‘వర్ణాలన్నీ' కలిసిపోవాలి. ఆడితే ఎలా ఆడాలీ?ముఖారవిందాలన్నీ మాయం అవ్వాలి. రెండుమూడు స్నానాలు అయ్యాకే అవి బైటపడాలి. ఆడితే ఎలా ఆడాలీ? అలసి కలసి ఒరిగిపోవాలి. హోమ్‌లీ స్వీట్స్‌ని... షేర్ చేసుకోవాలి.

చమ్ చమ్
కావలసినవి: పాలు: లీటరు; వెనిగర్: టేబుల్ స్పూన్; పంచదార: రెండు కప్పులు; నీళ్లు: నాలుగు కప్పులు; ఐసింగ్ సుగర్: మూడు టేబుల్ స్పూన్లు; కోవా: పావు కప్పు; టూటీఫ్రూటీ: కొద్దిగా; బాదంతురుము: కొద్దిగా, కుంకుమపువ్వు: కొద్దిగా
తయారు చేయు విధానం:
1. ముందుగా పాలను మరిగించాలి. మరుగుతుండగా వెనిగర్ వేస్తే, పాలు విరుగుతాయి. పల్చటి వస్త్రంలో పాలను వడకట్టి విరుగుముద్ద మీద ఏదైనా బరువు పెట్టి మూడునాలుగు గంటలసేపు పక్కన ఉంచాలి.
తర్వాత నీరు పూర్తిగా పోయి గట్టిగా అయ్యాక పాల విరుగును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి మనకు నచ్చే ఆకారంలో (గుండ్రంగా, పొడవుగా... ఎలా కావాలంటే అలా) వాటిని తయారుచేసి పక్కన ఉంచుకోవాలి
2. తర్వాత స్టౌ మీద ఒక పెద్దపాత్ర ఉంచి, అందులో నాలుగు కప్పుల నీరు, రెండు కప్పుల పంచదార వేసి కరిగించాలి.
3. తయారుచేసి ఉంచుకున్న వాటిని (చమ్‌చమ్‌లు) ఆ పాకంలో వేసి, పాత్ర మీద మూత పెట్టి, సుమారు 20 నిముషాలపాటు ఉడికించాలి కోవాలో ఐసింగ్ సుగర్ వేసి మెత్తగా అయ్యేలా కలపాలి
4. చమ్ చమ్‌లను పాకంలో నుంచి బయటకు తీసి చల్లారనివ్వాలి. వాటిని మధ్యకు కట్ చేసి... వాటిలో ఐసింగ్‌సుగర్, కోవాల మిశ్రమాన్ని స్టఫ్ చేయాలి. వీటిని రెండుగంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. పేపర్ కప్స్‌లో ఉంచి సర్వ్ చేయాలి.

ఠండై
కావలసినవి: నీళ్లు: రెండు లీటర్లు;పంచదార: 2 కప్పులు; రోజ్ వాటర్: అర టేబుల్ స్పూన్; కుంకుమపువ్వు: కొద్దిగాపేస్ట్‌కోసం... ఆల్మండ్స్: 25 (నానబెట్టి, తొక్కతీసేయాలి); జీడిపప్పు: 25 (నానబెట్టాలి); తర్బూజా గింజలు: మూడు టేబుల్ స్పూన్లు (నానబెట్టాలి);గసగసాలు: 3 టేబుల్ స్పూన్లు; ఏలకులు: టీ స్పూన్; లవంగాలు: నాలుగైదు; సోంపు: అర టేబుల్ స్పూన్; ధనియాల పొడి: అర టేబుల్ స్పూన్; మిరియాలు: ఆరేడు, మెంతులు: అర టీ స్పూను
తయారు చేయువిధానం:
1. అరలీటరు నీటిలో పంచదార వేసి పక్కన ఉంచి, కరిగాక వడకట్టాలి.
2. తర్వాత దనియాలపొడి తప్పించి మిగతా పదార్థాలను శుభ్రంగా కడిగి, రెండు కప్పుల నీటిలో గంటసేపు నానబెట్టి, నీరు వంపేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒకటిన్నర లీటర్ల నీటిలో వేసి బాగా కలిపి పల్చటి వస్త్రంలో వడకట్టాలి.
3. ఇప్పుడు ఆ నీటిలో పాలు, పంచదార, రోజ్‌వాటర్ వేసి కలపాలి రెండు మూడు గంటలసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. కుంకుమపువ్వు, బాదం తురుములతో గార్నిష్‌చేసి సర్వ్ చేయాలి.

బాదం పూరీ
కావలసినవి: మైదా: ఒకటిన్నర కప్పులు; బాదంపప్పు: అరకప్పు; కుంకుమపువ్వు: కొద్దిగా; నెయ్యి: టీ స్పూను; మిఠాయి రంగు: చిటికెడు; నెయ్యి + నూనె: డీప్‌ఫ్రైకి సరిపడా; బియ్యప్పిండి: పావు కప్పు; నెయ్యి లేదా వనస్పతి: పావు కప్పు. పాకం కోసం: పంచదార: ఒకటిన్నర కప్పులు; నీళ్లు: ముప్పావు కప్పు
తయారు చేయు విధానం:
1. మైదా జల్లించి, అందులో కుంకుమపువ్వు, మిఠాయి రంగు వేసి కలపాలి వేడినీటిలో బాదంపప్పులను పదినిముషాలు నానబెట్టి, పొట్టు తీసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి, దానిని మైదాలో వేసి చపాతీపిండిలా కలపాలి. (అవసరమనుకుంటే కొద్దిగా నీరు కలపవచ్చు) టీ స్పూను నెయ్యి వేసి మరోమారు కలపాలి
2. ఒక ప్లేట్‌లో బియ్యప్పిండి, నెయ్యి వేసి ఐదు నిముషాలపాటు బాగా కలపాలి మైదాపిండిని మీడియం సైజులో ఉండలు చేసుకుని, చపాతీలా ఒత్తుకోవాలి దానిమీద నెయ్యి, బియ్యప్పిండి మిశ్రమాన్ని సమానంగా పరవాలి.
3. దాని మీద మరో చపాతీ పెట్టాలి. ఇలా సుమారు ఐదారు పొరలు తయారుచేయాలి ఒక వైపు నుంచి మరో వైపునకు రోల్ చేయాలి. వాటిని మందంగా, గుండ్రంగా కట్ చేయాలి. మైదా అద్దుతూ వాటిని నెమ్మదిగా ఒత్తాలి. నూనెలో డీప్‌ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి..పెద్ద పాత్రలో పంచదార, నీరు వేసి స్టౌమీద ఉంచి, తీగపాకం వచ్చేవరకు కలపాలి. పాకంలో వేసి సుమారు గంటసేపు అలా ఉంచేయాలి. బాగా పాకం పీల్చుకున్నాక సర్వ్ చేయాలి.

లాకీ హల్వా
కావలసినవి: సొరకాయ (లాకీ) తురుము: నాలుగు కప్పులు (నీరు లేకుండా పిండేయాలి); పాలు: కప్పు; పంచదార: రెండు కప్పులు; చిరోంజీ: టేబుల్ స్పూను; కోవా: 250 గ్రా.; తర్బూజా విత్తనాలు: టేబుల్ స్పూన్
తయారు చేయు విధానం:
మందపాటి పాత్రను స్టౌ మీద ఉంచి, అందులో పాలు, సొరకాయ తురుము వేసి దగ్గరగా అయ్యేవరకు ఉడికించాలి (అడుగు అంటకుండా కలుపుతూండాలి)పంచదార వేసి బాగా చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి కోవా వేసి బాగా కలపాలి.చిరోంజీ, తర్బూజా గింజలతో గార్నిష్ చేయాలి.

కంజీ కే వడె
కావలసినవి: మినప్పప్పు: ఒకటిన్నర కప్పులు; కొత్తిమీర: రెండు టేబుల్ స్పూన్లు; అల్లం తురుము: కొద్దిగా; పచ్చిమిర్చి తరుగు: టీ స్పూను; ఉప్పు: తగినంత; మిరప్పొడి: టీస్పూను; సైంధవలవణం: టీ స్పూను; కిస్‌మిస్: 15; వేయించిన జీలకర్ర:రెండు టీ స్పూన్లు; ఇంగువ: చిటికెడు; నూనె: వేయించడానికి తగినంత; పెరుగు: 7 కప్పులు; పుదీనా చట్నీ: కొద్దిగా; తియ్య చింతపండు పచ్చడి: కొద్దిగా.
తయారు చేయు విధానం:
1. ముందుగా మినప్పప్పును రాత్రంతా నానబెట్టాలి మరుసటిరోజు ఉదయం నీటిని వడకట్టి, పప్పును మెత్తగా రుబ్బుకోవాలి.
2. తర్వాత తగినంత ఉప్పు, అర టీ స్పూను మిరప్పొడి, కిస్‌మిస్, ఇంగువ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి, రుబ్బినపిండిలో కలపాలి
3. బాణలిలో తగినంత నూనె పోసి, స్టౌ మీద ఉంచి, కాగాక, చేతితో పిండిని తీసి చిన్న చిన్న ఉండల్లా (పునుగుల మాదిరిగా) చేసి వేయాలి. గోధుమరంగు వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి వీటిని నీటిలో వేసి రెండు నిముషాలు ఉంచి, బయటకు తీసి నీటిని పిండేయాలి.
4. ఒక బౌల్‌లో పెరుగు, ఉప్పు, సైంధవలవణం వేసి బాగా కలపాలి. వేయించి ఉంచుకున్న పునుగులను ఒక ప్లేట్‌లో వేసి వాటి మీద ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా వేయాలి వాటి మీద పుదీనా చట్నీ, స్వీట్ చింతపండు చట్నీ వేయాలి మిరప్పొడి, జీలకర్ర పొడి ఈ రెండింటినీ పైన చల్లాలి కొత్తిమీర, అల్లంతురుము, పచ్చిమిర్చి తరుగులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

స్వీట్ కచోరీ
కావలసినవి: ఫిల్లింగ్ కోసం... కోవా: 200గ్రా; పాలపొడి: 50 గ్రా.; జాజికాయ + ధనియాలు + జీలకర్ర ... ఈ మూడూ కలిపి చేసిన పొడి: అర టీ స్పూను పైభాగానికి... బియ్యప్పిండి: 250 గ్రా; కార్న్‌ఫ్లోర్: టేబుల్ స్పూన్; నెయ్యి: 30 గ్రా. పాకం కోసం... పంచదార: 250 గ్రా; నీరు: కప్పు; పాలు: టేబుల్‌స్పూన్; కుంకుమపువ్వు: చిటికెడు. వేయించడానికి... నెయ్యి: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా ఫిల్లింగ్‌కోసం ఉపయోగించే వాటిని మెత్తగా కలుపుకోవాలి. పైభాగానికి ఉపయోగించేవాటిలో కొద్దిగా నీరు పోసి చపాతీపిండిలా కలుపుకోవాలి ఒక పాత్రలో నీరు, పంచదార, టేబుల్ స్పూను పాలు పోసి స్టౌ మీద ఉంచి, తీగపాకం వచ్చేవరకు కలపాలి.
2. తర్వాత పాకాన్ని వడబోసి అందులో కుంకుమపువ్వు వేసి కలపాలి తయారుచేసి ఉంచుకున్న ఫిల్లింగ్ మిశ్రమాన్ని ఉండలుగా చేసి పక్కన ఉంచుకోవాలి పైభాగం కోసం కలిపి ఉంచుకున్న పిండిని కూడా ఉండలుగా చేసి చిన్న చపాతీలా ఒత్తుకోవాలి. ఫిల్లింగ్ మిశ్రమాన్ని చపాతీ మీద ఉంచి అన్నివైపులా మూసి చేతితో జాగ్రత్తగా అదమాలి
3. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి కాగాక (సన్నమంట మీద) తయారుచేసి ఉంచుకున్న కచోరీలను నూనెలో వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీసేయాలి.
4. కొద్దిగా చల్లారిన తరవాత కచోరీకి చిన్న రంధ్రం చేసి, అందులో అరటేబుల్ స్పూన్ పాకం వేసి కచోరీ అంతా అంటేలాగా చేయాలి అరగంట తరవాత సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications