Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
వేసవితాపాన్ని తీర్చే బాదం మిల్క్

కావలసిన పదార్థాలు:
పాలు: 1/2ltr
పంచదార: 150grms
బాదం మాస్: తగినంత
యాలకుల పొడి: 1tsp
జీడిపప్పు, బాదంపప్పు: 1/2cup
తయారీ విధానం:
1. బాదం మిల్క్ తయారు చేసేందుకు పాలలో వెన్న పూర్తిగా తీయకుండా 6 శాతం ఫ్యాట్ ఉన్న పాలను తీసుకోవాలి. వాటిలో యాలకుల పొడి వేసి మరిగించాలి.
2. పాలు వేడి తగ్గాక పంచదార వేసి కరిగేంతదాకా కలిపి, చల్లార్చాలి. ఒక గ్లాసు పాలలో బాదం మాస్ (ఇది తాజ్ మాస్ పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. చూసేందుకు క్రీం కలర్లో పౌడర్లాగా ఉంటుంది)ని వేసి, కలిపి ఆ మిశ్రమం మొత్తాన్ని పాలల్లో వేసి కలియబెట్టాలి.
3. కలర్ సరిపోనట్లయితే ఆ పాలనే ఒక గ్లాసు తీసుకుని మరికొంత బాదం మాస్వేసి కలియబెట్టి మొత్తం పాలల్లో కలిపితే సరిపోతుంది.
4. చివరగా ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు వేసి ఫ్రిజ్లో ఉంచి చల్లబడ్డాక సర్వ్ చేయాలి. అంతే బాదం మిల్క్ సిద్ధమైనట్లే, కొలెస్ట్రాల్ ఏ మాత్రం లేని బాదంపప్పును రోజుకి రెండు పిడికిళ్ల చొప్పున తింటే ఎలాంటి గుండె సంబంధ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.



Click it and Unblock the Notifications