Latest Updates
-
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.!
చేపల కూర అంటే ఇలా ఉండాలి భయ్యా.. ఘుమఘుమలాడే బిహారీ స్టైల్ ఫిష్ కర్రీ!
చేపల కూర అంటే చాలా మందికి ప్రాణం. అయితే, ఎప్పుడూ ఒకే రకమైన పులుసు లేదా ఇగురు తిని మీకు బోర్ కొట్టిందా? అయితే మీరు కచ్చితంగా బిహారీ స్టైల్ ఫిష్ కర్రీ (చేపల కూర) రుచి చూడాల్సిందే. బీహార్ సాంప్రదాయ వంటకాల్లో ఒకటైన ఈ చేపల కూర ప్రత్యేకత దాని మసాలాలోనే ఉంది. పసుపు రంగు ఆవాలు, ఘాటైన వెల్లుల్లి, ఆవ నూనె కలయికతో తయారయ్యే ఈ కూర మీ నాలుకకు కొత్త రుచిని పరిచయం చేస్తుంది.

బీహారీ స్టైల్ షిఫ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
తాజా చేపలు (రోహు లేదా కట్ల): 500 గ్రాములు
పసుపు ఆవాలు: 3 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు: 15-20
ఉల్లిపాయ: 1 పెద్దది
టమోటాలు: 2 పెద్దవి
ఆవ నూనె: డీప్ ఫ్రైకి
పొడి మసాలాలు: పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి,మెంతులు
ఉప్పు: మీ రుచికి తగినంత
కొత్తిమీర: సన్నగా తరిగినది
బీహారీ స్టైల్ షిఫ్ కర్రీ తయారీ విధానం
-ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడగాలి. నీరంతా పోయాక, ఆ ముక్కలకు అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ కారం, కొద్దిగా ఉప్పు పట్టించి కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
-ఈ బీహారీ కూరకు అసలైన రుచినిచ్చేది ఆవాల పేస్ట్. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పసుపు ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
-స్టవ్ వెలిగించి కడాయిలో ఆవ నూనె వేయాలి. ఆవ నూనె బాగా వేడెక్కాక మ్యారినేట్ చేసిన చేప ముక్కలను వేయాలి. రెండు వైపులా మంచి గోధుమ రంగు వచ్చి, కరకరలాడేలా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
-అదే కడాయిలో మిగిలిన నూనెలో మెంతులు వేయాలి. మెంతులు వేగి చిటపటలాడుతుండగా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక, మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఆవాలు-వెల్లుల్లి పేస్ట్ వేసి చిన్న మంటపై పచ్చి వాసన పోయేలా 2-3 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి నూనె పైకి తేలే వరకు కలుపుతూ ఉండాలి.
-మసాలా బాగా వేగిన తర్వాత, సన్నగా తరిగిన టమోటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. టమోటాలు పూర్తిగా మగ్గిపోయి, గుజ్జులా మారి మసాలా నుంచి సువాసన వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు మీకు గ్రేవీ ఎంత కావాలో దానికి తగినట్లుగా నీళ్లు పోసి బాగా మరిగించాలి.
-గ్రేవీ ఉడుకుతున్నప్పుడు, ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలను అందులో వేయాలి. కడాయిపై మూత పెట్టి, చిన్న మంట మీద 5 నుండి 7 నిమిషాలు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల మసాలా ఫ్లేవర్స్ అన్నీ చేప ముక్కల లోపలి వరకు వెళ్తాయి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే నోరూరించే ఘుమఘుమలాడే బీహారీ స్టైల్ చేపల కూర రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications