Latest Updates
-
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
దాబా స్టైల్ కాజు పెప్పర్ మసాలా..రోటీ,నాన్ లోకి అదిరిపోయే కాంబినేషన్
చపాతీ, రోటీ, నాన్ లలోకి ఒకసారి కమ్మనైన, ఘాటైన జీడిపప్పు మసాలాను ప్రయత్నించి చూడండి. ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ వంటకం, దాని రిచ్ గ్రేవీ, మిరియాల ఘాటుతో భోజన ప్రియులను ఇట్టే ఆకట్టుకుంటుంది. రుచికరమైన, క్రీమీ కాజు పెప్పర్ మసాలాను ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
పేస్ట్ చేయడానికి జీడిపప్పు- పావు కిలో
కూరలో వేయడానికి జీడిపప్పు- పావు కిలో
గసగసాలు - 50 గ్రా
ఉల్లిపాయలు - 1 కిలో
టమోటాలు - అర కిలో
పచ్చిమిర్చి - 50 గ్రా
కొత్తిమీర - సగం కట్ట
అల్లం పేస్ట్ - 10 గ్రా
వెల్లుల్లి - 50 గ్రా
మిరియాల పొడి (నల్లనిది)- 1 టేబుల్ స్పూన్
తెల్ల మిరియాల పొడి- అర టేబుల్ స్పూన్
కారం - 2 టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి - 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర పొడి - పావు టేబుల్ స్పూన్
పసుపు - అర టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
బిర్యానీ ఆకు - 1
ఏలకులు - 3 గ్రాములు
లవంగాలు - 5 గ్రాములు
దాల్చిన చెక్క - 2 గ్రాములు
జీలకర్ర - 5 గ్రాములు
సోంపు - 3 గ్రాములు
వెన్న- 100 గ్రా
నెయ్యి - 100 మి.లీ
నూనె - 250 మి.లీ

తయారీ విధానం
-ముందుగా గ్రేవీ చిక్కగా రావడం కోసం, విరిగిన జీడిపప్పు ముక్కలను,గసగసాలను నీటిలో ఒక గంట సేపు నానబెట్టాలి.
-అవి బాగా నానాక మిక్సీ జార్ లో వేసి, కొద్దిగా పాలు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను కలిపి మరో పేస్ట్ లా చేసుకుని పక్కన ఉంచుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో వెన్న, నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, సోంపు వేసి చిటపటలాడే వరకు వేయించండి.
-ఇప్పుడు అల్లం పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. ఆ తర్వాత సన్నగా తురిమిన ఉల్లిపాయ ముద్దను వేసి, బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
-ఇప్పుడు అందులో టమోటా తురుము వేసి, అందులోని నీరంతా ఇగిరిపోయి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇప్పుడు కారం, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, తెల్ల మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి వేసి బాగా కలపాలి. మసాలాలు మాడిపోకుండా కొద్దిగా నీరు పోసి మరిగించండి.
-ఇప్పుడు అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న జీడిపప్పు-గసగసాల పేస్ట్ ను కూరలో వేయండి. గ్రేవీ మరీ చిక్కగా ఉంటే కొంచెం నీరు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి 5 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించండి.
-గ్రేవీ ఉడుకుతుండగా పావు కిలో ముక్కలు కాని పూర్తి జీడిపప్పును నేతిలో వేయించి కూరలో కలపండి. మరో 2 నిమిషాలు ఉడికించి చివరగా కొత్తిమీర చల్లి, పైన స్వచ్ఛమైన నెయ్యిని దారాళంగా పోసి దించేయండి.
-అంతే గుమగుమలాడే కాజు మిరియాల మసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications