Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.!
టెక్నాలజీ పరంగా బ్యాంకింగ్ లావాదేవీలు చాలావరకు డిజిటల్ అయినా కొన్ని పనుల కోసం తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. ఖాతా ఓపెన్ చేయడం, పలు ప్రభుత్వ పథకాలు, లోన్లు ఇలా కొన్ని పేపర్ సంబంధిత పనులకు బ్యాంకులకు వెళ్లక తప్పదు. ఈ క్రమంలో ప్రతి నెలా బ్యాంకుల వర్కింగ్ డేస్‌కి సంబంధించి ఆర్బీఐ క్యాలెండర్ విడుదల చేస్తుంది. అయితే అప్పుడప్పుడూ కొన్ని కారణాల వల్ల బ్యాంకులు నెలలో కొన్ని రోజులు మూతపడవచ్చు. అదేవిధంగా ఈ సెప్టెంబర్‌లో కూడా బ్యాంకులు వరుసగా ఐదు రోజులపాటు మూతపడనున్నాయి. ఏయే రోజుల్లో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. కారణమేంటి.. తెలుసుకుందాం..

సెప్టెంబర్ చివరి వారం దేశవ్యాప్తంగా బ్యాంకులు ఐదు రోజులపాటు సేవలను నిలిపివేస్తున్నాయి. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు అంటే మూడు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో కస్టమర్ల సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఇక 26వ తేదీ నాలుగో శనివారం, 27వ తేదీ ఆదివారం కావడంతో ఈ రెండు రోజులు కూడా బ్యాంకులు పనిచేయవు. మొత్తంగా వరుసగా ఐదు రోజుల పాటు మూతపడనుండటంతో కస్టమర్లకు దానికి ముందే బ్యాంకు పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ రంగ అతి పెద్ద బ్యాంకు ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో వినియోగదారులు అత్యవసరమైన బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

సమ్మె రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్ బ్రాంచ్‌లు క్లోజ్ అవుతున్న నేపథ్యంలో లావాదేవీలకు అంతరాయం కలగనుంది. అయితే డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఎస్బీఐ స్పష్టం చేసింది. క్యాష్ విత్‌డ్రా కోసం ఏటీఎంలు, డిపాజిట్ మెషీన్లు, కస్టమర్ సర్వీస్ పాయింట్లను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, YONO ఎస్‌బీఐ, యూపీఐ యాప్స్ ద్వారా లావాదేవీలు, సాధారణ చెల్లింపులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఈ క్రమంలో బ్యాంకులో ఫిజికల్ డాక్యుమెంట్, చెక్ సంబంధిత పనులు ఉన్నవారు డిజిటల్‌గా ఈ సేవలు పొందలేరు. కాబట్టి సమ్మె నేపథ్యంలో కస్టమర్లు చివరి నిమిషం దాకా వేచి ఉండకుండా ఈ వారంలోపే పనులు పూర్తి చేసుకోవడం ఉత్తమం. అయితే ఈ సమ్మెలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు మాత్రమే పాల్గొననున్నారు. ప్రైవేట్ బ్యాంకులు తెరిచి ఉండే అవకాశాలు ఉన్నాయి.

వారానికి ఐదు రోజులే పని విధానం, పనితీరు ఆధారంగా ఉద్యోగులకు ఇన్సెంటివ్‌లు, కొత్త సిబ్బంది నియామకం, పెన్షన్, కొత్త పెన్షన్ స్కీమ్, గ్రాట్యుటీ లాంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ నేపథ్యంలో సంఘాలు సమ్మెకి దిగుతున్నాయి. ఈ సమ్మెపై ఈనెలలోనే 11వ తేదీన సమ్మె నిర్వహించిన విషయం తెలిసిందే.



Click it and Unblock the Notifications
