Latest Updates
-
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం! -
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి -
జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం! -
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా.. -
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు! -
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్!
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి!
దక్షిణ భారతీయ భోజనం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వేడి వేడి అన్నం, కాస్త నెయ్యి, గుమగుమలాడే కమ్మటి సాంబార్. సాంబార్ అద్భుతమైన రుచితో కుదరాలంటే అందులో వేసే కూరగాయల కంటే, మనం వాడే సాంబార్ పొడి పైనే ఆ రుచి ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
మార్కెట్లో దొరికే రంగుల పొడుల కంటే, ఇంట్లోనే మన చేతులతో స్వయంగా, ఎంచుకున్న మంచి దినుసులతో చేసుకునే సాంబార్ పొడి ఇచ్చే సువాసనే వేరు. అసలైన సౌత్ ఇండియన్ రుచితో లంచ్ సాంబార్ పొడి మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

లంచ్ సాంబార్ పొడి తయారీకి కావలసిన పదార్థాలు
పచ్చి శనగపప్పు - పావు కప్పు
కందిపప్పు - పావు కప్పు
మినపప్పు - పావు కప్పు
జైపూర్ గ్రీన్ ధనియాలు - ఒకటిన్నర సూప్ బౌల్స్
బ్యాడిగి మిర్చి లేదా కాశ్మీరీ ఎండుమిర్చి - 1 సూప్ బౌల్
జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు
మిరియాలు - 1 టేబుల్ స్పూన్
మెంతులు - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - ఒక గుప్పెడు
ఇంగువ- 1 టీస్పూన్
పసుపు - 1 టీస్పూన్
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
లంచ్ సాంబార్ పొడి తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, మందంగా ఉండే ఒక కడాయిని పెట్టుకోండి. నూనె వేయకుండానే కడాయిలో పచ్చి శనగపప్పు, కందిపప్పు, మినపప్పు వేసి సన్నని మంటపై దోరగా వేయించండి. పప్పుల నుండి కమ్మటి వాసన వస్తున్నప్పుడు వాటిని ఒక పళ్లెంలోకి తీసుకోండి.
-ఆ తర్వాత అదే కడాయిలో జైపూర్ గ్రీన్ ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు, మెంతులు ఒక్కొక్కటిగా వేసి, మాడిపోకుండా జాగ్రత్తగా వేయించి పక్కన పెట్టుకోండి. చివరగా కడాయిలో గుప్పెడు కరివేపాకును వేసి, అందులో తేమ పూర్తిగా పోయి ఆకులు కరకరలాడే వరకు వేయించండి. అన్ని పదార్థాలను వేయించడం పూర్తయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
-ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఆ వేడి దినుసులలోనే ఇంగువ పొడి, పసుపు వేసి బాగా కలపండి. వేడికి ఆ రెండు పదార్థాల పచ్చివాసన పోతుంది. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత, మిక్సీ జార్ లో వేసుకుని మెత్తటి పౌడర్ లా గ్రైండ్ చేసుకోండి.
-తయారైన ఈ గుమగుమలాడే సాంబార్ పొడిని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోండి. తడి తగలకుండా చూసుకుంటే చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది.
-సాంబార్ పొడికి మరింత గాఢమైన రుచి, మైమరపించే సువాసన రావాలంటే సాధారణ ధనియాలకు బదులుగా తప్పనిసరిగా జైపూర్ గ్రీన్ ధనియాలు వాడటానికి ప్రయత్నించండి. ఇది మీ సాంబార్ రుచిని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
