Latest Updates
-
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్‌డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.!
రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్.. ఇంట్లోనే పక్కా లోకల్ ఫ్లేవర్ తో ఇలా చేసేయండి!
ఎప్పుడూ ఒకే రకమైన చికెన్ కూర తిని బోర్ కొట్టిందా? అయితే ఈ సారి కాస్త కొత్తగా, ఘాటుగా, నోటికి రుచిగా తగిలేలా అదిరిపోయే గ్రీన్ చిల్లీ చికెన్ ట్రై చేయండి. చిల్లీ చికెన్‌ను వేడి వేడి అన్నం, బగారా రైస్, చపాతీ లేదా బిర్యానీలోకి నంచుకుని తింటే ఆ మజాయే వేరు. రెస్టారెంట్లకు వెళ్లే పని లేకుండా, మన ఇంట్లో ఉండే సహజమైన దినుసులతో పక్కా లోకల్ స్టైల్ లో, అద్భుతమైన రుచితో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

చిల్లీ చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు
-అల్లం - 2 అంగుళాల ముక్క
-వెల్లుల్లి రెబ్బలు - ఒక గుప్పెడు
-పచ్చిమిర్చి - 6 (మీ కారానికి తగినట్లుగా)
-నల్ల మిరియాలు - 2 టేబుల్ స్పూన్లు
-జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు
-కొత్తిమీర - ఒక గుప్పెడు
-పుదీనా ఆకులు - కొద్దిగా (మంచి ఫ్లేవర్ కోసం)
-టొమాటో - 1 (చిన్నగా తరిగినది)
-వంట నూనె - తగినంత
-చికెన్ - 1 కిలో
-ఉప్పు - మీ రుచికి సరిపడా
-నీళ్లు - ఉడకడానికి తగినంత
-ఉల్లిపాయలు - 3
-పచ్చిమిర్చి - 3
చిల్లీ చికెన్ తయారీ విధానం
-ఈ చిల్లీ చికెన్ రుచి అంతా మనం తయారుచేసుకునే మసాలాలోనే ఉంటుంది. ఇందుకోసం ముందుగా మిక్సీజార్ లో 2 ఇంచుల అల్లం, పొట్టు తీయని గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, 6 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, గుప్పుడు కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1 టమాటో పెద్ద ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఈ పేస్ట్ ను పక్కన ఉంచుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక అందులో సోంపు వేసి వేయించాక అందులో క్లీన్ చేసిన 1 కేజీ చికెన్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి. ముక్కలు కొంచెం మెత్తబడి, ఆయిల్ పైకి తేలుతున్న సమయంలో అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి కలిసేలా కలిపి అందులో సరిపడా నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. మసాలాలోని పచ్చివాసన పోయేంత వరకు, మంటను మీడియంలో పెట్టి చికెన్ ను బాగా కలుపుతూ వేయించాలి.
-మరోపక్క స్టవ్ మీద ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడయ్యాక అందులో 3 ఉల్లిపాయల సన్నని తరుగు, 3 పచ్చిమిరపకాయల చీలికలు వేసి జస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి.
-వేయించిన ఉల్లి,పచ్చిమిర్చి మిశ్రమాన్ని స్టవ్ మీద పాన్ లో ఉడుకుతున్న చికెన్ లో వేయండి. మరో 2 నిమిషాలు ఉడికించాలి.
-చికెన్ మెత్తగా ఉడికి, నీరంతా ఇగిరిపోయి గ్రేవీ చిక్కబడి చికెన్ ముక్కలకు పట్టుకునేంత వరకు ఉంచాలి. గ్రేవీ నుండి నూనె పైకి తేలుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు చిల్లీ చికెన్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
