Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్‌కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
చికెన్, మటన్ కూడా దీని ముందు బలాదూర్.. స్పైసీ మష్రూమ్ చుక్కా రుచి చూశారా?
ఎప్పుడూ రొటీన్ గా ఇంట్లో వండుకునే కూరలతో బోర్ కొట్టిందా? ఏదైనా స్పైసీగా, రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే చేసుకోవాలని ఉందా? మాంసాహారానికి ఏమాత్రం తీసిపోని రుచితో, నోరూరించే ఒక అద్భుతమైన వంటకం ఉంది..అదే మష్రూమ్ చుక్కా. పుట్టగొడుగులతో ఎన్నో రకాల వంటకాలు చేసినప్పటికీ, ఈ డ్రై రోస్ట్ స్టైల్ చుక్కా రుచి మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా.

మష్రూమ్ చుక్కా తయారీకి కావాల్సిన పదార్థాలు
మష్రూమ్స్ (పుట్టగొడుగులు) - 2 ప్యాకెట్లు
కాశ్మీరీ కారం - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - అర టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - అర టేబుల్ స్పూన్
మిరియాల పొడి - పావు టేబుల్ స్పూన్
పసుపు - చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
ఫ్రైడ్ ఆనియన్స్ (నూనెలో వేయించిన ఉల్లిపాయలు) - గుప్పెడు
పచ్చిమిర్చి - 2 లేదా 3
పెరుగు - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు, నూనె, కొత్తిమీర, కరివేపాకు - తగినంత
మష్రూమ్ చుక్కా తయారీ విధానం
-ముందుగా మష్రూమ్స్ ను శుభ్రంగా కడిగి, సగానికి కట్ చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో కట్ చేసిన మష్రూమ్స్ వేయాలి. ఇప్పుడు అందులో కాశ్మీరీ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు వేయాలి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల తాజా పెరుగును జతచేయాలి. ఈ మసాలాలన్నీ మష్రూమ్ ముక్కలకు బాగా పట్టేలా చేత్తో కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఒక మందపాటి కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కాక పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ మిశ్రమాన్ని పాన్ లో వేయాలి. మష్రూమ్స్ ఉడుకుతున్నప్పుడు వాటిలో నుంచి నీరు బయటకు వస్తుంది కాబట్టి అదనంగా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు.
-మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించాలి. నీరంతా ఇగిరిపోతున్న సమయంలో.. ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను (ఫ్రైడ్ ఆనియన్స్) చేతులతో కొద్దిగా నలిపి అందులో చల్లాలి. నూనె పైకి తేలుతూ, మష్రూమ్స్ ముక్కలకు మసాలా అంతా పట్టి చుక్కా(డ్రై రోస్ట్) లాగా దగ్గరపడే వరకు వేయించుకోవాలి.
-చివరిగా..నూనె పైకి తేలి, మసాలా అంతా ముక్కలకు పట్టిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు.. వేడివేడి స్పైసీ మష్రూమ్ చుక్కా రెడీ.
-దీనిని ప్లేట్ లోకి తీసుకుని, కొద్దిగా నిమ్మకాయ పిండుకుని, ఉల్లిపాయ ముక్కలతో తింటే.. ఆ మజానే వేరు. బిర్యానీ, పలావ్, లేదా చపాతీతో పాటు సైడ్ డిష్ గా ఇది అమృతంలా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications