Latest Updates
-
జలై 1నే డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? 2026 థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత -
జూలై 2న కుంభరాశిలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి తిరుగేలేదు, ఎవరికి జాగ్రత్త? -
National Doctor's Day 2026: తెల్ల కోటు వేసుకున్న ప్రత్యక్ష దేవుళ్లు..డాక్టర్స్ డే విషెస్ ఇలా చెప్పండి -
జూలై 1 శాలరీ డే: ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
మీ చిన్నారి చేతిలో దెబ్బలు తింటున్నారా? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
మన పూర్వీకులు తిన్న బ్రేక్ ఫాస్ట్ ఇదే..కొండలను ఢీకొట్టే శక్తి, ఇలా చేసుకోండి -
ధనిష్ఠ నక్షత్రంలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి నేడు అదృష్టం, ధనలాభం ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - బుధవారం, 01 జూలై 2026 -
యూట్యూబ్ వీడియో చూసి గర్భిణీ ప్రసవం, ఆపై మృతి.. సొంత చికిత్సలతో ఎంత ప్రమాదమో తెలుసా.! -
ఒంటరిగా ఉండటం ఆరోగ్యకరమేనా.. ఇవే కారణాలు అయితే నిర్లక్ష్యం వద్దు.!
నోరూరించే వంకాయ పచ్చి కారం..వేడి అన్నంతో తింటే అద్భుతో అద్భుత అద్భుతసహ్య..
వంకాయ లాంటి కూర లేదు..అనేది మన పాత సామెత. మన తెలుగు వారి భోజనంలో వంకాయకు ఉన్న ప్రత్యేక స్థానం అంతా ఇంతా కాదు. వంకాయతో ఏ కూర చేసినా అద్భుతంగానే ఉంటుంది. అయితే ఎప్పుడూ చేసుకునే సాధారణ వేపుళ్లు, మసాలా కూరలు కాకుండా కొంచెం వెరైటీగా, ఘాటుగా, నోటికి రుచిగా తినాలనిపిస్తే వంకాయ పచ్చి కారం కర్రీని తప్పకుండా ట్రై చేయాల్సిందే. వేడి వేడి అన్నంలో ఈ కూర కలుపుకుని తింటుంటే ఆ మజాయే వేరు. అలాగే చపాతీ, రోటీ, పుల్కాల్లోకి కూడా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఘుమఘుమలాడే స్పైసీ వంకాయ కూరను ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

వంకాయ పచ్చి కారం తయారీకి కావాల్సిన పదార్థాలు
పచ్చ వంకాయలు: పావు కిలో
పచ్చిమిర్చి: మీ కారానికి తగినన్ని
అల్లం ముక్కలు: 2 లేదా 3 చిన్నవి
వెల్లుల్లి రెబ్బలు: 8
కొత్తిమీర: కొద్దిగా
జీలకర్ర: అర టీస్పూన్
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: అర టీస్పూన్
పసుపు: పావు టీస్పూన్
నీళ్లు: తగినన్ని
ఉల్లిపాయలు: కొద్దిగా
మెంతికూర: కొద్దిగా

-ముందుగా పావు కిలో వంకాయలను శుభ్రంగా కడగాలి. మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కోసుకోవాలి. వంకాయలు చేదు ఎక్కకుండా, రంగు మారకుండా ఉండటానికి కోసిన వెంటనే వాటిని ఒక గిన్నెలో ఉప్పు నీళ్లు తీసుకుని అందులో వేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కూర కోసం మీరు ఏ రకం వంకాయలైనా వాడుకోవచ్చు.
-ఇప్పుడు అసలైన రుచినిచ్చే మసాలాను తయారు చేసుకోవాలి. ఇందుకోసం ఒక మిక్సీ జార్ లో మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, 2 అల్లం ముక్కలు, 8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే అర టీస్పూన్ జీలకర్ర వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి.
-నూనె కాగాక ముందుగా నీటిలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి వేయించాలి. కడాయిపై మూతపెట్టి మంటను మీడియంలో ఉంచి వంకాయ ముక్కలను బాగా మగ్గనివ్వాలి. అవి మెత్తగా ఉడికిన తర్వాత అర టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాక ఈ కూరకు మరింత అద్భుతమైన రుచిని జోడించడానికి కొద్దిగా తాజా మెంతికూర ఆకులను కలుపుకోండి. మెంతికూర, వంకాయ కాంబినేషన్ కూర రుచిని అమాంతం పెంచుతుంది.
-ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి మసాలా పేస్ట్ ను కడాయిలో వేసి, పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ వేయించాలి. మసాలా వంకాయలకు పట్టిన తర్వాత, కూర గ్రేవీ కోసం కొద్దిగా నీళ్లు పోసి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల మసాలాల ఫ్లేవర్స్ అన్నీ వంకాయ ముక్కలకు బాగా పట్టి కూర రుచిగా తయారవుతుంది.
-అంతే ఎంతో రుచికరమైన స్పైసీ వంకాయ పచ్చి కారం కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications