Latest Updates
-
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా..
శ్రావణ శుక్రవారం స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కమ్మనైన ఆవ పులిహోర ఇలా చేయండి.!
శ్రావణ మాసం ప్రారంభమైంది. రేపు మొదటి శ్రావణ శుక్రవారం. ఈ మాసంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శుక్రవారం రోజు మహిళలు నైవేద్యం సమర్పించి, ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈ సందర్భంగా రేపు లక్ష్మీదేవికి ఆవ పులిహోరను బ్రాహ్మణ స్లైల్లో, గుడిలో ప్రసాదం టేస్ట్ వచ్చేలా ఇలా సింపుల్గా చేయండి.. అమ్మవారితో పాటు ఇంటిల్లిపాదీ ఫిదా అవుతారు.

ఆవ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు..
బియ్యం- కేజీ
చింతపండు- పావు కేజీ
ఆవాలు- రెండు టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి- పది నుంచి పదిహేను
నూనె- 3 టేబుల్ స్పూన్స్
పల్లీలు- మూడు టేబుల్ స్పూన్లు
పచ్చిశనగపప్పు- రెండు టేబుల్ స్పూన్స్
మినప్పప్పు- రెండు టేబుల్ స్పూన్స్
కరివేపాకు- ఐదు రెబ్బలు
ఇంగువ- టీ స్పూన్
అల్లం ముక్కలు- ఐదు
పచ్చిమిర్చి- పదిహేను
పసుపు- రెండు టీస్పూన్లు
ఉప్పు- రుచికి సరిపడా
బెల్లం- నిమ్మకాయ సైజు
ఆవ పులిహోర తయారీ విధానం
కొత్తగా ఏదైనా తినాలని ఉందా? ఒక్కసారి ఈ రవ్వ రొట్టె చేసి చూడండి..చచ్చేదాకా ఇదే కావాలంటారు!
ముందుగా బియ్యాన్ని రెండు సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఆ లోపు పావు కేజీ చింతపండును శుభ్రంగా కడిగి కొన్ని నీళ్లు పోసి నాననివ్వాలి.
ఇప్పుడు రైస్ కుక్కర్ లేదా స్టవ్పైన అన్నం వండుకోవాలి. మిక్సీ బౌల్లో టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి, కొంచెం పసుపు వేసి కాస్త గరుకుగా రుబ్బుకోవాలి.
ఆ లోపు స్టవ్పైన బాణలి పెట్టుకుని నూనె పోసి కాగనివ్వాలి. అందులో పల్లీలు వేసి వేగాక, పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేసి వేగనివ్వాలి.

ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసి వేగిన తర్వాత, చిన్నగా కట్ చేసుకున్న ఎండు మిర్చి వేసి వేగనివ్వాలి. ఇంగువ వేసి కలుపుకోవాలి. తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి.
ఇప్పుడు ఉడికిన అన్నాన్ని ఒక వెడల్పాటి బేసిన్లో తీసుకుని అందులో పరిచి కాసేపు చల్లారనివ్వాలి. తర్వాత ప్రిపేర్ చేసుకున్న తాలింపును ఈ అన్నంలో వేసుకోవాలి. కానీ కలపకూడదు.
ఈ పొడి వేసి పచ్చిమిరపకాయ వేపుడు చేస్తే.. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు!
ఇక, నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జును తీసి తాలింపు పెట్టుకున్న బాణలిలోనే పోసుకుని చిక్కగా అయ్యే వరకు మరగనివ్వాలి.
ఈ రసం ఉడుకుతున్నప్పుడు అందులో బెల్లం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఈ గుజ్జు చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నంలో కలుపుకోవాలి.

గరిటెతో తాలింపు, చింతపండు గుజ్జు మొత్తం కలిసేలా నిదానంగా కలుపుతూ ఉండాలి. పులిహోర మొత్తం కలిసిన తర్వాత చివరిగా ఆవ పిండి వేసి కలుపుకోవడమే..
రుచికరమైన ఆవ పులిహోర రెడీ.. ఈ పులిహోరను పూజలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. పులిహోరను తయారుచేసిన తర్వాత కనీసం గంటసేపైనా అలాగే ఉంచండి.
వేడిగా ఉన్నప్పటి కంటే మూడు నాలుగు గంటల తర్వాత ఈ పులిహోర రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. పులుపు, కారం, ఉప్పు, ఆవపిండి ఫ్లేవర్ అన్నీ అన్నంలోకి ఊరి రుచి రెట్టింపు అవుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
