Latest Updates
-
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
తొక్కే కదా అని తీసిపారేయకండి..అందులోనే దాగుంది అసలైన రుచి..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే పుచ్చకాయ తొక్క చట్నీ
ఎర్రగా, రసభరితంగా ఉండే పుచ్చకాయ గుజ్జును ఎంతో ఇష్టంగా తినే మనం.. ఆ కింద ఉండే తెల్లటి మందపాటి తొక్కను పనికిరాదని చెత్తబుట్టలో పారేస్తుంటాం. కానీ పారేసే ఆ తెల్లటి భాగంతో ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే సైడ్ డిష్ తయారు చేయవచ్చని మీకు తెలుసా?
తెల్లటి పుచ్చకాయ తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని ఉపయోగించి చేసే చట్నీ అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాకుండా, ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది.

పుచ్చకాయ తొక్క చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
పుచ్చకాయ తెల్లటి తొక్క ముక్కలు - 1 కప్పు (పచ్చని పైతొక్కను
చెక్కివేయాలి)
తరిగిన టమాటా ముక్కలు - అర కప్పు
మినపపప్పు - 2 చెంచాలు
ఎండు మిరపకాయలు - 3
పచ్చి కొబ్బరి తురుము లేదా ఎండు కొబ్బరి పొడి - 3 చెంచాలు
నూనె - 1 చెంచా
ఆవాలు - అర చెంచా
మెంతులు - చిటికెడు
పసుపు - అర చెంచా
చింతపండు - చిన్న ఉసిరికాయంత
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - అవసరమైనంత
పుచ్చకాయ తొక్క చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ పెట్టుకోండి. అందులో అర చెంచా కొబ్బరి నూనె వేయండి. నూనె వేడెక్కాక మినపపప్పు, ఆవాలు, చిటికెడు మెంతులు, ఎండు మిరపకాయలు వేసి మంటను సిమ్ లో ఉంచి దోరగా, బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించండి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే బాండీలో మరో అర చెంచా నూనె వేడి చేయండి. అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ తెల్లటి తొక్క ముక్కలు, టమాటా ముక్కలు వేసి పచ్చివాసన పోయేలా వేయించండి.
-ముక్కలు కొద్దిగా రంగు మారుతున్నప్పుడు అందులో పసుపు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ముక్కలు ఉడకడానికి సరిపడా కొద్దిగా నీళ్లు పోసి, మూతపెట్టి మంటను తగ్గించండి. పుచ్చకాయ తొక్క ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి.
-ముక్కలు బాగా మెత్తబడ్డాక అందులో కొబ్బరి తురుము వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ముందుగా వేయించిన మినపపప్పు, ఎండు మిరపకాయల మిశ్రమాన్ని వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత అదే జార్ లో చల్లారిన టమాటా-పుచ్చకాయ తొక్క మిశ్రమాన్ని కూడా వేసి మృదువైన పేస్ట్ లా రుబ్బుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.
-రుబ్బుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఉప్పు సరిచూసుకోండి. మరింత రుచి కోసం పైన కొద్దిగా ఆవాలు, మినపపప్పు, కరివేపాకు, ఎండుమిర్చితో తాలింపు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది.
-అంతే పుచ్చకాయ తొక్క చట్నీ రెడీ. వేడి వేడి ఇడ్లీల పైన కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ చట్నీతో తింటే ఆ మజాయే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
