Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
నోరూరించే మామిడికాయ తాలింపు అన్నం..అదిరిపోతుంది బాసూ కేక కేక అంతే..
దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్నంతో చేసే ఎన్నో రకాల వంటకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. వాటిలో చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర ఎంత ప్రసిద్ధమో, వేసవికాలంలో లభించే పచ్చి మామిడికాయలతో చేసే మామిడికాయ తాలింపు అన్నం కూడా అంతే ప్రసిద్ధి చెందింది. నోరూరించే ఈ వంటకం తయారీ చాలా సులువు. అలాగే ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వంట రాని వారు, బ్యాచిలర్స్ కూడా నిమిషాల్లో ఎంతో సులభంగా చేసుకోగలిగే వంటకం ఇది. మిగిలిపోయిన అన్నంతో కూడా దీనిని చేసుకోవచ్చు.

మామిడికాయ తాలింపు అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు
-వండిన అన్నం
-పచ్చి మామిడికాయ
-పసుపు
-ఉప్పు
-నూనె
-ఆవాలు
-జీలకర్ర
-పచ్చి శనగపప్పు
-ఎండుమిర్చి
-ఇంగువ
-కరివేపాకు
-కొత్తిమీర
-చల్ల మిరపకాయలు
-ఉల్లిపాయ
మామిడికాయ తాలింపు అన్నం తయారీవిధానం
-ముందుగా ప్రెజర్ కుక్కర్ లో కప్పున్నర కడిగిన బియ్యం, అర టీస్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 3 కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి స్టవ్ మీద పెట్టండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయండి. మూత తీసి అన్నాన్ని ఒకసారి పైనుంచి కిందకి ఒకసారి గరిటతో కలుపుకొని పక్కన పెట్టుకోండి. దీంతో అన్నం చల్లారిపోయి పొడి పొడిగా వస్తుంది.
-తర్వాత మామిడికాయ తాలింపు అన్నం కోసం ఒక పేస్ట్ తయారుచేసుకోవాలి. ఇందుకోసం ఒక మీడియం సైజు పుల్లని మామిడికాయను ముక్కలుగా కోసుకోండి. ఈ మామిడికాయ ముక్కలను మిక్సీ గిన్నెలో వేసి,ఇందులోనే అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, 5 ఎండుమిర్చి, 1 టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి, కొంచెం నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 5 చెంచాల నూనె వేడి చెయ్యండి. నూనె వేడెక్కాక అందులో 4 చల్ల మిరపకాయలు వేసి మీడియం మంట మీద నెమ్మదిగా వేయించండి. దీంతో మిర్చి లోపలిదాకా వేగి నల్లబడుతుంది. ఇప్పుడు వీటిని ఓ ప్లేట్ లోకి తీసుకోండి.
-స్టవ్ మీద పాన్ లోని అదే ఆయిల్ లో 1 టీస్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు వేసి తాలింపుని ఎర్రగా వేపుకోవాలి. తర్వాత ఇందులో అర టీస్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, 1 రెబ్బ కరివేపాకు వేసి వేయించాక ఇందులోనే 1 మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వీటిని జస్ట్ మెత్తబడనిస్తే చాలు. ఉల్లిపాయను ఎర్రగా వేపకూడదు.
-ఇప్పుడు అందులో గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పేస్ట్ వేసి 3 నిమిషాలు కలుపుతూ వేయించుకోండి. తర్వాత పూర్తిగా చల్లారిన అన్నంని ఇందులోనే వేసి పెద్ద మంట మీద బాగా కలుపుతూ టాస్ చేసుకోవాలి. చివరగా ఇందులో ముందుగా వేయించిన చల్ల మిరిపకాయలను చేత్తో మెత్తగా చిదిమివేసి అన్నంలో వేసి కలుపుకున్నాక ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని స్టవ్ ఆపేయండి. అంతే మామిడికాయ తాలింపు అన్నం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
