Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
రోజూ తినే దోసెలు బోర్ కొట్టాయా? అయితే ఈ సమ్మర్ స్పెషల్ దోసె ట్రై చేయండి
ఎండాకాలం వచ్చేసింది. ఈ ఎండల తీవ్రతకు మన శరీరం సహజంగానే అలసిపోతుంది. ఇలాంటి వాతావరణంలో కడుపుకు తేలికగా ఉండే, త్వరగా జీర్ణమయ్యే, అలాగే శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆహార పదార్థాలను తీసుకోవాలని మనందరికీ అనిపిస్తుంది. వేడి వేడి, మసాలాలతో కూడిన ఆహారాలకు బదులుగా, నోటికి రుచిగా తగిలే చల్లని వంటకాలను మనసు కోరుకుంటుంది. ఇలాంటి సమయంలో ఒక అద్భుతమైన వేసవి వంటకం దోసకాయ(ఖీర్) నీర్ దోస. ఇది తయారు చేయడానికి ఎంతో సులభం, కడుపుకు చాలా తేలికగా ఉంటుంది.

ఈ దోసకాయ నీర్ దోస కేవలం రుచికరమైనదే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దోసకాయలో నీటి శాతం అత్యధికంగా ఉంటుంది కాబట్టి, ఇది శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది. బియ్యం ద్వారా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. పైగా ఈ దోస తయారీలో వాడే నూనె చాలా తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి, డైట్ చేసే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్.
ఖీరా నీర్ దోసె తయారీకి కావలసిన పదార్థాలు
బియ్యం - 1 కప్పు
లేత దోసకాయ (ఖీరా) - 1
పచ్చిమిర్చి - 2
అల్లం - చిన్న ముక్క
ఉప్పు -సరిపడా
నీళ్లు - తగినన్ని
జీలకర్ర - అర టీస్పూన్

ఖీరా నీర్ దోసె తయారీ విధానం
-ముందుగా 3-4 గంటల పాటు బియ్యం నానబెట్టుకోవాలి
-నానబెట్టుకున్న బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
-ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన బియ్యం, తొక్క తీసి తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి,అల్లం ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ నీర్ దోస పిండి సాధారణ దోస పిండిలా కాకుండా నీళ్లలా పల్చగా ఉండాలి. కాబట్టి పిండి నునుపుగా తయారైన తర్వాత, తగినన్ని నీళ్లు పోసి పల్చగా కలుపుకోవాలి. చివరగా రుచికి సరిపడా ఉప్పు, కాస్త జీలకర్ర వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, నాన్ స్టిక్ పెనం పెట్టి వేడి చేయాలి. పెనం మరీ ఎక్కువగా వేడెక్కకూడదు. మీడియం మంట మీద ఉంచి, పెనానికి కొద్దిగా నూనె రాసి, ఒక గరిటెడు పిండిని పెనం అంచుల వెంబడి పోయాలి. సాధారణ దోసలాగా గరిటెతో రుద్దకూడదు. పిండి దానంతట అదే పల్చగా పరుచుకుంటుంది. ఇప్పుడు పైన ఒక మూత పెట్టి ఒకటి, రెండు నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి.
-ఈ నీర్ దోసెను రెండో వైపు తిరగేయాల్సిన అవసరం లేదు. దోస అంచులు వాటంతట అవే పైకి లేస్తున్నప్పుడు, చాలా సున్నితంగా తీసి ప్లేట్ లోకి మార్చుకోవాలి.
-ఖీరా నీర్ దోసెను కొబ్బరి చట్నీ, పుదీనా పచ్చడి లేదా ఏదైనా తేలికపాటి కూరగాయల కుర్మాతో కలిపి తింటే ఆ రుచే వేరు. ఉదయం అల్పాహారంగా లేదా రాత్రి పూట తేలికపాటి డిన్నర్ గా తీసుకోవడానికి ఇది అద్భుతమైన ఛాయిస్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
