Latest Updates
-
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
ఎగ్ భుర్జీ తెలుసు,మరి చికెన్ భుర్జీ రుచి చూశారా?..సండే లంచ్ అదిరిపోవాల్సిందే!
ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహార ప్రియులకు ఇంట్లో చికెన్ ఉండాల్సిందే. సాధారణంగా మనం చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బిర్యానీ వంటివి తరచుగా ఇంట్లో చేసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడూ ఒకేలాంటి వంటకాలు తింటే బోర్ కొడుతుంది..అందుకే ఈ ఆదివారం ఒక సరికొత్త, అద్భుతమైన రుచితో కూడిన చికెన్ భుర్జీ ట్రై చేయండి. ఎగ్ భుర్జీ గురించి మనకందరికీ తెలుసు, కానీ ఈ చికెన్ భుర్జీ రుచి మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. బోన్ లెస్ చికెన్ కీమా, గుడ్లు, మసాలా దినుసులు కలిపి చేసే ఈ వంటకం నోటిలో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది. చపాతీ, పూరీ, పరాఠా, రోటీ, బ్రెడ్.. ఇలా దేనితో తిన్నా దీని రుచి అమోఘం.

చికెన్ భుర్జీ తయారీకి కావలసిన పదార్థాలు
బోన్ లెస్ చికెన్ (కీమా) - 500 గ్రాములు
ఉల్లిపాయలు - 2
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
టమోటా - 1 పెద్దది
పసుపు పొడి - అర టీస్పూన్
కారం పొడి - ఒకటిన్నర టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
గరం మసాలా పొడి - అర టీస్పూన్
ఉప్పు - మీ రుచికి తగినంత
వంట నూనె లేదా వెన్న - 3 టేబుల్ స్పూన్లు
గుడ్లు - 2
కొత్తిమీర - కొద్దిగా
నిమ్మకాయ - సగం దబ్బ

చికెన్ భుర్జీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ లేదా బాండీ పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
-ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి.
-ఇప్పుడు బాండీలో సన్నగా తరిగిన టమోటా ముక్కలను ఇందులో వేసి బాగా కలపాలి. టమోటాలు కాస్త మగ్గిన తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. మసాలాలన్నీ టమోటాలకు పట్టి, టమోటా ముక్కలు పూర్తిగా మెత్తబడి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
-ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కీమాను బాండీలో వేయాలి. మసాలాలన్నీ చికెన్ కీమాకు బాగా పట్టేలా గరిటెతో చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత బాండీపై మూత పెట్టి సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి.
-చికెన్ పూర్తిగా ఉడికి, కూర కాస్త దగ్గరపడిన తర్వాత అందులో రెండు గుడ్లను పగలగొట్టి వేయాలి. గుడ్లు వేసిన వెంటనే గరిటెతో వేగంగా కలుపుకోవాలి. గుడ్డు చికెన్ కీమాతో కలిసిపోయి పొడిపొడిగా భుర్జీలాగా మారుతుంది.
-చివరగా, సన్నగా తరిగిన తాజా కొత్తిమీర ఆకులను పైన చల్లుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం పిండుకుని కలుపుకోవాలి. అంతే చికెన్ భుర్జీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
