తీపి లస్సీ తయారీ విధానం ; పంజాబీ తీపి లస్సీ తయారు చేయటం ఎలా

By: Deepthi
Subscribe to Boldsky

ఈ స్వీటు లస్సీ రెసిపి పంజాబ్ లో పుట్టింది. ఉత్తరభారతంలో ఇది ప్రసిద్ధ పానీయం. వేసవిలో ఎంతో డిమాండ్ ఉండే ఈ పానీయం దానిలో ఉండే పెరుగు వల్ల చల్లచల్లగా హాయిగా ఉంటుంది.

పంజాబీ తీపి లస్సీ పెరుగు, చక్కెర వంటి ముఖ్యపదార్థాలతో పాటు, రోజ్ వాటర్, ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్లను కూడా కలిగి ఉండే శీతల పానీయం. ఇది తేలికగా ఉండి, ప్రతి భోజనం తర్వాత తీసుకుంటారు. ప్రత్యామ్నాయంగా మీగడ లేదా క్రీమును దీనికి కలిపి కొంచెం గాఢమైన ఘనపానీయంగా కూడా మార్చవచ్చు.

ఇది చేయటం చాలా సులువు మరియు దీని తయారీ విధానం కూడా అస్సలు శ్రమ కలిగించనటువంటిది. మీ ఇంట్లో దీన్ని తయారుచేయటానికి కింద ఇచ్చిన తయారీ విధానాన్ని చిత్రాలు, వీడియో సాయంతో నేర్చుకోండి.

తీపి లస్సీ రెసిపివీడియో

 తీపి లస్సీ రెసిపి
తీపి లస్సీ రెసిపి । పంజాబీ స్వీటు లస్సీ తయారీ ఎలా । లస్సీ తయారీ విధానం । తీపి పెరుగు పానీయం రెసిపి
Prep Time
5 Mins
Cook Time
5 నిమిషాలు
Total Time
10 Mins

Recipe By: మీనా బంఢారీ

Recipe Type: పానీయాలు

Serves: 2కి

Ingredients
 • గట్టి పెరుగు - 2కప్పులు

  చల్లటి పాలు - ½ కప్పు

  చల్లటి నీరు - ½ కప్పు

  పంచదార -3 చెంచాలు

  ఏలకుల పొడి -1 చెంచా

  రోజ్ వాటర్ - ½ చెంచా

  ఐస్ క్యూబ్స్ - 7-8

  తరిగిన బాదం - అలంకరణకి

  తరిగిన పిస్తాపప్పు - అలంకరణకి

  కుంకుమపువ్వు రేకులు-అలంకరణకి

Red Rice Kanda Poha
How to Prepare
 • 1. గట్టి పెరుగును ఒక గిన్నెలో పోయండి

  2. చల్లటి పాలు, చల్లని నీరు కూడా పోసి ఉండలు కట్టకుండా బాగా కలపండి.

  3.తర్వాత చక్కెర, ఏలకుల పొడి, రోజ్ వాటర్ వేయండి.

  4. ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలపండి.

  5. అంతటిని మిక్సీ జార్ లో పోయండి.

  6. మిక్సీలో బాగా తిప్పండి.

  7. వడ్డించే గ్లాసులలో పోయండి.

  8. తరిగిన బాదం, పిస్తా, కుంకుమపువ్వు రేకులతో అలంకరించండి.

Instructions
 • 1.చక్కెర నేరుగా కాకుండా పొడిచేసిన చక్కెరను కూడా కలపవచ్చు.
 • 2. రోజ్ వాటర్ వేయడం వేయకపోవడం మీ ఇష్టం. తప్పనిసరి కాదు.
Nutritional Information
 • సరిపోయే పరిమాణం - 1గ్లాసు
 • క్యాలరీలు - 158 కాలరీలు
 • కొవ్వు - 5 గ్రాములు
 • ప్రొటీన్లు - 2 గ్రాములు
 • కార్బొహైడ్రేట్లు - 25 గ్రాములు
 • చక్కెర - 10 గ్రాములు

స్టెప్ బై స్టెప్ - తీపి లస్సీ తయారీ ఎలా

1. గట్టి పెరుగును ఒక గిన్నెలో పోయండి

 తీపి లస్సీ రెసిపి

2. చల్లటి పాలు, చల్లని నీరు కూడా పోసి ఉండలు కట్టకుండా బాగా కలపండి.

 తీపి లస్సీ రెసిపి
 తీపి లస్సీ రెసిపి
 తీపి లస్సీ రెసిపి

3. తర్వాత చక్కెర, ఏలకుల పొడి, రోజ్ వాటర్ వేయండి.

 తీపి లస్సీ రెసిపి
 తీపి లస్సీ రెసిపి
 తీపి లస్సీ రెసిపి

4. ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలపండి.

 తీపి లస్సీ రెసిపి
 తీపి లస్సీ రెసిపి

5. అంతటిని మిక్సీ జార్ లో పోయండి.

 తీపి లస్సీ రెసిపి

6. మిక్సీలో బాగా తిప్పండి.

 తీపి లస్సీ రెసిపి

7. వడ్డించే గ్లాసులలో పోయండి.

 తీపి లస్సీ రెసిపి

8. తరిగిన బాదం, పిస్తా, కుంకుమపువ్వు రేకులతో అలంకరించండి.

 తీపి లస్సీ రెసిపి
 తీపి లస్సీ రెసిపి
 తీపి లస్సీ రెసిపి
 తీపి లస్సీ రెసిపి
[ 5 of 5 - 66 Users]
Subscribe Newsletter