Latest Updates
-
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
నోట్లో వేస్తే కరిగిపోయే జీడిపప్పు మైసూర్ పాక్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన సాంప్రదాయ స్వీట్లలో మైసూర్ పాక్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే ఈ తీపి వంటకం అంటే ఇష్టపడని వారు బహుశా ఉండరు. అయితే సాధారణ మైసూర్ పాక్ కు కాస్త భిన్నంగా, మరింత రుచిగా ఉండేలా జీడిపప్పు మైసూర్ పాక్ ఎప్పుడైనా ట్రై చేశారా? కమ్మటి నెయ్యి వాసన, వేయించిన జీడిపప్పుల కరకరలు కలిసి ఈ స్వీట్ కు ఒక రాజసాన్ని తీసుకొస్తాయి. ఇంట్లోనే ఈజీగా, పర్ఫెక్ట్ గా జీడిపప్పు మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

జీడిపప్పు మైసూర్ పాక్ తయారీకి కావలసిన పదార్థాలు
శనగపిండి (బేసన్) - 1 కప్పు
పంచదార - 2 కప్పులు
నీళ్లు - 1 కప్పు
నెయ్యి - ఒకటిన్నర కప్పులు
జీడిపప్పు - అర కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్
జీడిపప్పు మైసూర్ పాక్ తయారీ విధానం
-ముందుగా జీడిపప్పును దోరగా వేయించి,మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి అడుగు ఉన్న ఒక గిన్నెను పెట్టుకోండి. అందులో చక్కెర, నీళ్లు పోసి మీడియం మంట మీద మరగనివ్వండి. చక్కెర పూర్తిగా కరిగి, పాకం కొద్దిగా చిక్కబడే వరకు మరిగించాలి. ఇది స్వీట్ కు సరైన ఆకృతిని ఇస్తుంది.
-ఇప్పుడు మరో పక్క స్టవ్ మీద కడాయి పెట్టుకుని, అందులో కొద్దిగా నెయ్యి వేయండి. మంటను పూర్తిగా సిమ్ లో ఉంచి శనగపిండిని వేసి నెమ్మదిగా వేయించండి. శనగపిండిలోని పచ్చి వాసన పోయి, కమ్మటి సువాసన వచ్చే వరకు వేయించాలి. పిండి రంగు మారకూడదు, మాడకూడదు.
-వేయించి పెట్టుకున్న శనగపిండిలో ముందుగా సిద్ధం చేసుకున్న వేడి చక్కెర పాకాన్ని నెమ్మదిగా పోయాలి. పోస్తున్నంత సేపు ఒక చేత్తో గరిటెతో ఎక్కడా ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యిని కొద్దికొద్దిగా (ఒక్కో గరిటె) అందులో వేస్తూ నిరంతరం కలుపుతూ ఉండాలి. నెయ్యి పిండిలో కలిసిపోయి, ఉడుకుతున్నప్పుడు వచ్చే గుమగుమలు ఇల్లంతా వ్యాపిస్తాయి.
-కొద్దిసేపటికి మిశ్రమం బాగా చిక్కబడి, పాత్ర అంచులను వదులుతూ, గుల్లగా మారుతుంది. సరిగ్గా ఈ దశలోనే ముందుగా దోరగా వేయించి బరకగా పొడి చేసి పెట్టుకున్న జీడిపప్పు మిశ్రమం, యాలకుల పొడి వేసి మరోసారి బాగా కలపాలి.
-స్వీట్ చేయడానికి ముందే కొద్దిగా నెయ్యి రాసి ఒక పళ్ళెన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వేడి వేడి మిశ్రమాన్ని ఆ పళ్ళెంలో పోసి పైభాగం సమానంగా వచ్చేలా గరిటెతో సున్నితంగా పరచండి. అది సరిగ్గా అతుక్కోవడానికి తేలికగా నొక్కండి.
-కొద్దిగా చల్లారిన తర్వాత, పూర్తిగా గట్టిపడకముందే చాకుతో మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోండి. అంతే నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మటి, రుచికరమైన జీడిపప్పు మైసూర్ పాక్ తినడానికి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
