Latest Updates
-
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
ఈ ఒక్క గింజలతో మూడు రకాల టిఫిన్స్.. పోషకాలు పుష్కలం, ప్రయోజనాలు మెండు.!
ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాల్లో చియా సీడ్స్ ఒకటి. సీజన్ ఏదైనా ఆరోగ్యానికి ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే వీటిని సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. అందుకే చియా సీడ్స్‌ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగుతుంటారు. అయితే రోజూ ఇదే విధానంలో కాకుండా చియా సీడ్స్‌ను వివిధ రకాలుగా తీసుకోవచ్చు. దీని ద్వారా రుచికి రుచితో పాటు ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతమవుతుంది.

సబ్జా గింజల మాదిరిగా ఉండే చియా సీడ్స్‌లో చాలా పోషకాలు ఉన్నాయి. అందుకే ఇవి ఏ కాలంలోనైనా సరే బాగా ప్రాచుర్యం పొందాయి. కూరగాయలు, పండ్లు, నాన్ వెజ్‌లో లభించే ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్‌తో పాటు వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో ఆరోగ్యకరమైన ఆహారంగా వైద్యులు పరిగణిస్తున్నారు. చియా గింజల్లోని ఫైబర్, ప్రొటీన్ కడుపు నిండిన భావనను కలిగించి ఆకలిని నియంత్రిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలు, శక్తిని అందిస్తాయి. మీ రోజువారీ డైట్‌లో వీటిని భాగం చేసుకోవడం మేలు చేస్తాయి. ఈ క్రమంలో ఉదయాన్నే చియా సీడ్స్‌ను నీళ్లతోనే కాకుండా రుచికరమైన అల్పాహారంగానూ తయారుచేసుకోవచ్చు.
చియా గింజల పుడ్డింగ్
చియా గింజలతో పుడ్డింగ్ కోసం ముందు రోజు రాత్రే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల చియా గింజలను పాలు లేదా పెరుగులో కలపాలి. రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఇందులో తాజా పండ్ల ముక్కలు, డ్రై ఫ్రూట్స్ కలుపుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో దీనిని తినడం ద్వారా త్వరగా కడుపు నిండి ఆకలిని నియంత్రిస్తుంది.

చియా గింజలు ఓట్స్
ఆరోగ్యానికి దోహదం చేసే ఓట్స్‌లో చియా సీడ్స్‌ను కలిపి తీసుకోవచ్చు. ఒక గిన్నెలో ముందుగా ఉడికించిన ఓట్స్ తీసుకోవాలి. అంతకుముందుగా రాత్రంతా రెండు టీ స్పూన్ల చియా గింజలను నానబెట్టాలి. ఉదయాన్నే ఓట్స్‌లో వీటిని కలపాలి. ఇందులో అరటి పండ్లు, ఆపిల్స్, బెర్రీలు, నట్స్ కలుపుకోవచ్చు. ఈ మిశ్రమం జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది.
చియా సీడ్స్ స్మూతీ
రెండు స్పూన్ల చియా సీడ్స్‌ను రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే అరటిపండును పాలు లేదా పెరుగుతో కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో చియా గింజలను కలుపుకోవాలి. దీని ద్వారా ప్రొటీన్లు, విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది శరీరానికి పోషణ అందిస్తుంది.

ఇవి గుర్తుంచుకోండి..
చియా గింజలను ఎప్పుడైనా నానబెట్టిన తర్వాతే తీసుకుంటే ప్రయోజనాలు అందుతాయి. మొదటిసారి తీసుకుంటున్న వాళ్లు తక్కువ పరిమాణంతో ప్రారంభించాలి. ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు కలగవచ్చు. ఇందులో ఫైబర్ ఉన్న కారణంగా పుష్కలంగా నీరు తాగాలి. దీంతో పాటు సమతుల్యం ఆహారం తీసుకోవాలి. ఏదైనా అసౌకర్యం ఏర్పడితే చియా గింజలను తీసుకోవడం ఆపి వైద్యుడిని సంప్రదించాలి.
అయితే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు, మందులు వాడుతున్న వారు చియా గింజలను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వీటిని వైద్యులు, పోషకాహార నిపుణుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. బీపీతో పాటు జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు డాక్టర్ల సిఫార్సు లేకుండా వీటిని తీసుకోకూడదని గమనించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
