Latest Updates
-
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.! -
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్‌తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.! -
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.! -
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్‌కార్న్‌తో ఈవెనింగ్ సూపర్! -
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు
చిన్న వయసులోనే వినికిడి లోపం.. ఈ స్వల్ప మార్పులతో చెవి సమస్యలకు చెక్.!
ఈ రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే వినికిడి లోపం సమస్య ఏర్పడుతోంది. గట్టిగా మాట్లాడినా చిన్నగా వినిపించడం, చిన్నగా మాట్లాడితే వినపడకపోవడం, టీవీ వాల్యూమ్ ఎక్కువగా పెట్టుకుని చూడటం, ఒక విషయాన్ని పదేపదే అడగటం, ఫోన్ మాట్లాడేటప్పుడు స్పీకర్ పెట్టుకుని మాట్లాడటం.. వీటిని వినికిడి లోపంగా పరిగణిస్తారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తోంది.. డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి.. వైద్య నిపుణుల సలహాలు తెలుసుకుందాం..

మీరు లేదా మీ కుటుంబీకుల్లో ఎవరికైనా ఈ సమస్య ఏర్పడితే దానిని కొట్టిపారేయకుండా నిపుణుడిని సంప్రదించి టెస్టులు, చికిత్స తప్పనిసరిగా చేయించకోవాలి. సకాలంలో చికిత్స, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, వినికిడి పరికరాలు అమర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
వినికిడి లోపానికి కారణాలు
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ వినికిడి సమస్య ఏర్పడుతుంటుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు 30 ఏళ్ల లోపు వారిలో కూడా వినికిడి లోపం ఏర్పడి ఇబ్బందులు పడుతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అందుకనుగుణంగా జీవనశైలిలో మార్పులు, హై వాల్యూమ్‌తో ఇయర్ ఫోన్లు వాడటం, చెవి ఇన్‌ఫెక్షన్లు, డయాబెటిక్, అధిక రక్తపోటు, సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండటం వంటి వాటి ద్వారా వినికిడి సమస్య ఏర్పడుతోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఒక మనిషి మెల్లగా మాట్లాడినా, గట్టిగా మాట్లాడినా, ఎలా మాట్లాడినా వారు సమీపంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా వినిపిస్తుంది. అయితే మీకు వాయిస్ స్పష్టంగా వినపడకపోయినా, గుసగుసగా వినిపించినా, వినేటప్పుడు చెవి లోపల గర్ మనే శబ్దం వస్తుంది. ఇలాంటి సమస్యలను లైట్ తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
జన్యుపరమైన కారణాలు కూడా వినికిడి సమస్యకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. చెవిపొరలో చిల్లులు పడటం కూడా ఇందుకు కారణం. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను చిన్న వయసులోనే దాదాపుగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సమస్య ఇంకా కొనసాగితే ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

చెవుల ఆరోగ్యం..
చిన్న వయసు నుంచే చెవులను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇందుకోసం సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ సమతుల్య ఆహారం, తాజా ఆకుకూరలు, తాజా పండ్లు, గింజలు, చేపలు తీసుకోవాలి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వాటిని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా చెవుల నరాలకు రక్తప్రసరణకి మెరుగవుతుంది. దీని ద్వారా చెవుల లోపలి భాగాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ బి12, ఫోలేట్, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, జింక్ తగినంత మోతాదులో తీసుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.
జీవనశైలిలో మార్పులు
సమతుల్య ఆహారంతో పాటు జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవాలి. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్, ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ లేకుండా గడపడం కష్టతరంగా మారింది. వినికిడి లోపం నుంచి బయటపడేందుకు ఇయర్‌ఫోన్‌లను తక్కువ వాల్యూమ్‌లో ఉపయోగించాలి. 60 శాతం కంటే తక్కువ వాల్యూమ్‌లోనే వినాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. గంటకు మించి ఎక్కువసేపు ఇయర్‌బడ్స్ చెవిలో ఉండకూడదు. ఎక్కువసేపు శబ్దంలో వినడం ద్వారా చెవి లోపలి పొర దెబ్బతింటుంది. ముఖ్యంగా చెవులను శుభ్రం చేసుకోవడానికి ఇయర్ పిక్స్ వంటి వాటిని వాడకూడదు. చెవిలో ఏదైనా సమస్యగా అనిపిస్తే సొంత చికిత్స తీసుకోకుండా చెవి ఆరోగ్య నిపుణుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications