Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
సెవన్ కప్ బర్ఫీ రిసిపి : దివాలీ స్పెషల్ స్వీట్
మరికొద్ది రోజుల్లో దీపావళి రాబోతున్నది..కళ్ళు మిరుమిట్లుగొలేపే దీపకాంతులతో ఇల్లంతా రంగురంగుల రంగోలీలతో..ఇంటినిండా బందువులు, స్నేహితులతో చాలా ఆడంభరంగా జరుపుకొనే దీపావళి. హిందువులు జరుపుకొనే అతి పెద్ద పండుగ దీపావళి. దీపావళి స్పెషల్ దీపాలంకరణ, లక్ష్మీ పూజ, రకరకాల పిండి వంటలు, స్వీట్స్ తో అందరినీ ఆనందపరచడమే. చిన్న పెద్ద, అని లేకుండా అందరూ సంతోషంగా ఎంజాయ్ చేసే ఈ దీపావళికి కొన్ని రకాల స్వీట్స్ తో ఆథిధ్యం ఇస్తే అథితులు మోచ్చుకోక ఉండలేరు.
ఈ దీపావళి సమయంలో అనేక రకాల స్వీట్స్ తయారుచేస్తుంటారు. సాంప్రదాయంగా లడ్డు, బర్ఫీ, గుజియా మరియు గులాబ్ జామూన్ ఎక్కువ. మరి కొంత డిఫరెంట్ టేస్ట్ కావాలంటే, బేసన్ బర్ఫీని ట్రై చేయాల్సిందే. ఇది చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. మరి ఈ స్వీట్ రిసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
శెనగపిండి: 1cup
పంచదార: 2cups
పాలు: 1cup
నెయ్యి : 1cup
కొబ్బరి తురుము: 1cup
బాదం: 1cup
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ తీసుకొని అందులో 1చెంచా నెయ్యి వేసి అందులో అరకప్పు శెనగపిండి వేయాలి.
2. శెనగపిండి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ సన్నని మంట మీద వేగించుకోవాలి.
3. తర్వాత అందులోనే కొద్దిగా పాలు చేర్చి బాగా మిక్స్ చేయాలి.
4. శెనగపిండి ఉండలు లేకుండా పాలలో బాగా మిక్స్ అయిన తర్వాత అందులో పంచదార వేసి బాగా మిక్స్ చేయాలి.
5. పంచదార కరగడానికి కనీసం 10-15 నిముషాలు టైమ్ పడుతుంది. తర్వాత అందులోనే కొబ్బరి తురుము వేసి బాగా మిక్స్ చేయాలి . ఈ మొత్తం మిశ్రమాన్ని తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
6. మొత్తం మిశ్రమం దగ్గరపడేటప్పుడు, స్టౌ ఆఫ్ చేసి మరో పాన్ లో కిద్దిగా నెయ్యి వేసి, పాన్ మొత్తం అప్లై చేసిన తర్వాత శెనగపిండి మిశ్రమాన్ని వేసి 6-7 గంటల సయం రూమ్ టెపంరేచర్లో చల్లారనివ్వాలి.
7. స్వీట్ చిక్కగా మారిన తర్వతా (అరగంట)తర్వాత మీకు కావల్సిన షేప్ లో కట్ చేసుకోవాలి . తర్వాత వాటి మీద బాదం ముక్కలను వేసి సర్ది మరికొద్దిసేపు చల్లారనివ్వాలి. అంతే సెవన్ కప్ స్వీట్ బర్ఫీ రిసిపి రెడీ..



Click it and Unblock the Notifications