Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
సక్కరే పూర్ణం పోలి : గణేష చతుర్థి స్పెషల్ ..!
మరికొద్ది రోజుల్లో గణేష్ చతుర్థి రాబోతున్నది. విఘ్నాలు తొలగించే వినాయకుడికి నైవేద్యం పెట్టే సమయం వచ్చేసింది.వినాయక చవితి సందడి మొదలైంది.. చవితి దేవునికి చవులూరే వంటకాలతో స్వాగతం పలికే సందర్భం ఇది. భక్తుల పెట్టే ప్రసాదం భుజించి, వరప్రసాదాలు అందించే వినాయకుడికి నైవేద్యాల విందుతో నిండుదనం చేకూర్చుదాం. విఘ్నాలు తొలగించే వినాయకుడికి నైవేద్యం పెట్టే సమయం వచ్చేసింది. ప్రాంతాలు, భాషలు వేరైనా- గణనాయకుడికి నైవేద్యంగా పెట్టే భక్ష్యాలు ఒకటే. ముఖ్యంగా వినాయకుడికి స్వీట్స్ అంటే మహా ప్రీతి. మోదక్ అంటే వినాయకుడికి మహా ఇష్టం. అటువంటిదే మరో వంట కొబ్బరి బర్ఫీ. ఇలా చెప్పుకుంటే పోతే పిండివంటలు చాలనే ఉన్నాయి...అందుకే గణేష్ చతుర్ధషికి చాలా వరకూ ఇండియన్ డిజర్ట్సే ఉంటాయి.
సౌత్ ఇండియన్ డిజర్ట్స్ లో పూర్ణం పోలి ఒకటి. అందులోనే పంచదారతో తయారుచేసే పూర్ణం పోలీలంటే చాలా క్రేజ్ . ఎందుకంటే పంచదారతో తయారుచేసే పోలిలి చాలా డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. ఇంకా బాదం మిల్క్, నెయ్యితో సర్వ్ చేస్తే దీని రుచి అమోఘంగా ఉంటుంది. గణేష చతుర్థతికి తయారుచేసే వంటల్లో పూర్ణం పోలిలు ఒకటి. మరి దీన్ని ఎలా తయారుచేయాలి. వంటకు అవసరమయ్యే పదార్థాలేంటో తెలుసుకుందాం..

కావల్సి పదార్థాలు:
పంచదార : 3 cups
సన్న రవ్వ(సూజి రవ్వ: 2 and a 1/2 cups
కొబ్బరి తురుము: 5-6cups
మైదా: 1 and a 1/2 cup
గసగసాలు: 2tsp
యాలకల పొడి: 1tsp
నూనె: కొద్దిగా
నెయ్యి: కొద్దిగా
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రవ్వ, మైదా, నూనె వేసి మిక్స్ చేయాలి. ఈ పదార్థాలన్ని మిక్స్ చేసి, పిండిని సాఫ్ట్ గా కనలిపి రెండు మూడు గంటలు పక్కన పెట్టేసుకోవాలి. (ఈ పిండిని కలుపుకోవడానికి నూనె ఎక్కువ అవసరం అవుతుంది)
2. గసగసాలు లైట్ గా వేగించుకోవాలి. వీటిని మిక్సీ జార్ లోకి ట్రాన్సఫర్ చేసుకోవాలి. వీటితో పాటు షుగర్, కొబ్బరి తురుము మరియు యాలకలు జోడించి పౌడర్ చేసుకోవాలి.
3. తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ నుండి కొద్దిగా కొద్దిగా చేతిలోకి తీసుకుని, చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒక ప్లేట్ లో రెడీ చేసి పెట్టుకోవాలి.
4. ఇప్పడు వెడల్పుగా ఉన్న ప్లాస్టిక్ కవర్ లేదా ప్లాస్టిక్ కోటెడ్ కవర్ తీసుకుని కవర్ మీద నూనె రాసి పెట్టుకోవాలి.
5. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న మైదపిండి నిండి నిమ్మకాయంత సైజ్ లో తీసుకుని, ప్లాస్టిక్ కవర్ మీద ఉంచి, చేత్తోనే వెడల్పుగా ఒత్తుకోవాలి. తర్వాత మద్యలో మిక్సోలో పౌడర్ చేసి, ఉండలు చేసి పెట్టుకున్న పూర్ణంను పెట్టి, అన్ని వైపులా క్లోజ్ చేయాలి.
6. తర్వాత చపాతీల వలె రోల్ చేసుకోవాలి. చేత్తోనే ఒత్తుకోవచ్చు. ఒక పక్క ఇలా పూర్ణం పోలిని ఒత్తుకుంటూనే, మరో ప్రక్క స్టౌ మీద పాన్ పెట్టి, నెయ్యి రాసి, పూర్ణం పోలిని రెండ్ వైపులా బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకూ కాల్చుకోవాలి.
7. ఇప్పుడు దీన్ని ప్లేట్ లోకి ట్రాన్సఫర్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి.
8. ఈ స్పెషల్ పంచదార పూర్ణం పోలిని లార్డ్ గణేషకి నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే ఇంట్లోవారికి కూడా ఈ ఫెస్టివల్ సీజన్ లో నోరు తీపి చేయవచ్చు.



Click it and Unblock the Notifications