Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
గణపతి పబ్బ మోరియా....గోధుమ రవ్వ ఖీర్.. టేస్ట్ కరో యార్..!
ఒకప్పుడు గణేష్ చతుర్థి నార్త్ ఇండియాలో ముఖ్యంగా మహారాష్టల్లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే వారు. అయితే ఇప్పుడు దేశం మొత్తం ఘనంగా సెలబ్రెట్ చేసుకునే అతి పెద్ద పండుగా గణేష్ చతుర్థి. మరి మీరు కూడా మరాఠీ స్టైల్లో గణేష్ చతుర్థిని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే, పండగకు సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ను తెలుసుకోవాల్సిందే... గణేష్ చతుర్థికి తప్పనిసరిగా తయారుచేసే వంటల్లో గోధుమ రవ్వ ఖీర్ ఒకటి.
మరాఠి స్టైల్లో 'గెహున్ కా ఖీర్ ' తయారుచేయాలనుకుంటే, ఈ స్పెషల్ వంటను ఎలా తయారుచేయాలి, దీన్ని తయారుచేయడానికి కావల్సిన పదార్థాలేంటో తప్పనిసరిగా తెలుసుకోవాలి.
వినాయక చవితికి తయారుచేసే డిఫరెంట్ వంటకాల మెయిన్ మెనులో తప్పని సరిగా ఉండేది గోధుమ రవ్వ కీర్. బియ్యం రవ్వకు బదులుగా గోధుమ రవ్వను తయారుచేస్తారు
అలాగే కొన్ని పదార్థాలను కూడా వినియోగిస్తుంటారు. మరి ఈ స్పెషల్ స్వీట్ తో 'గణపతి పబ్బ' ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలంటే, మీరు కూడా రెడీ అయిపోండి. ఈ స్పెషల్ స్వీట్ రిసిపిని వినాయకుడికి నైవేద్యంగా పెట్టడం , అలాగే కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ స్వీట్ రిసిపిని షేర్ చేసుకుని పండగను ఎంజాయ్ చేయండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ స్వీట్ రిసిపిని ఎలా తయారుచేయాలి. ఏఏ వస్తువులు అవసరమవుతాయో తెలుసుకుందాం...రండి...

కావల్సిన పదార్థాలు:
గోధుమ రవ్వ - 2 ½ cups
పాలు - 5 cups
బెల్లం తురుము - 2 ½ cups
నెయ్యి - 4 tbsp
కొబ్బరి తురుము - 1 cup
యాలకలపొడి - ¼th tsp
నట్స్ - ¼th cup
ఎండు ద్రాక్ష - 10 (for garnishing)
తయారుచేయు విధానం:
1. గోధుమ రవ్వను నీటితో రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి. తర్వాత నీళ్ళ పోసి, రాత్రంతా నానెబట్టుకోవాలి
2. తర్వాత రోజు ఉదయం, నీరు వంపేసి, క్లీన్ గా ఉండే టవల్ మీద ఆరబోయాలి. డ్రైగా మారిన తర్వాత, రఫ్ గా పొడి చేసుకోవాలి. రవ్వలా తయారవుతుంది. లేదా రఫ్ గా పేస్ట్ చేసుకోవాలి. మరీ స్మూత్ గా లేకుండా చూసుకోవాలి.
3. తర్వాత ఒక మందపాటి పాన్ తీసుకుని, స్టౌ మీద పెట్టి, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి.
4. ఇప్పుడు అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోధు పేస్ట్ ను వేసి, అతి తక్కువ మంట మీద 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత బెల్లం, పాలు, మరియు కొబ్బరి తురుము వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలిజ
6. ఈ మిశ్రమం మరీ చిక్కబడుతున్నట్లు అనిపిస్తే మరికొద్దిగా పాలు జోడించుకోవచ్చు.
7. మొత్తం మిశ్రమం పాలతో కలిసి, కరిగిపోయాలా చూసుకోవాలి.
8. ఇప్పుడు ఈ మిశ్రమంలో డ్రై నట్స్ ను జోడించాలి. అలాగే యాలకల పొడి కూడా జోడించాలి
9. మద్య మద్యలో కలియబెడతూ , మీడియం మంట మీద ఖీర్ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.
10. పూర్తిగా ఉడికిన తర్వాత, ఈ ఖీర్ సర్వ్ చేయడానికి తగిన విధంగా పల్చగా కూడా ఉండేట్లు చూసుకోవాలి.
11. అంతే వీట్ ఖీర్ రెడీ. స్టౌ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి .
12. చివరగా ఎండు ద్రాక్షతో గార్నిష్ చేసి, దేవుడుకి నైవేద్యం పెట్టాలి. తర్వాత ఇంటిల్లిపాదికి సర్వ్ చేసి కొత్త టేస్ట్ ను ఎంజాయ్ చేయాలి.



Click it and Unblock the Notifications