ఇనుములాంటి బలాన్నిచ్చే మినుముల అన్నం..నడుము నొప్పితో బాధపడేవారికి బెస్ట్ ఫుడ్

Posted By:

తమిళనాడు వంటకాలు అంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఇడ్లీ, సాంబార్, పొంగల్. అయితే తిరునల్వేలి, మధురై, కన్యాకుమారి, తూత్తుకుడి వంటి జిల్లాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆరోగ్యకరమైన వంటకమే మినుముల అన్నం. ఇది ఎముకలకు ఉక్కులాంటి బలాన్నివ్వడమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెరగనివ్వదు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పులతో బాధపడేవాళ్లకి ఇది మంచి ఆహారం.

ఇందులో వాడే పొట్టు తీయని మినపప్పులలో కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఆడపిల్లలకు హార్మోన్ల బ్యాలెన్స్ మెరుగుపర్చడంలో సాయపడుతుంది. మినుముల అన్నం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Tamilnadu special mimumula annam recipe in telugu for iron strong bones

కావాల్సిన పదార్థాలు

-పొట్టు మినపప్పు
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-బిర్యానీ ఆకు
-యాలకలు
-లవంగాలు
-స్టార్ అనాస
-ఎండుమిర్చి
-జీలకర్ర
-మిరియాలు
-కరివేపాకు
-ఉల్లిపాయ
-నెయ్యి
-నూనె
-నీళ్లు
-కొత్తిమీర
-ఉప్పు

పాకం పట్టే పనిలేకుండా పాతకాలం నాటి పర్ఫెక్ట్ రాగి లడ్డు..ఎముకలు దృఢంగా మారతాయి!

తయారీ విధానం

-ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. అందులో 1 కప్పు పొట్టు మినపప్పు వేసి మీడియం మంట మీద 7-8 నిమిషాలు బాగా రోస్ట్ చేయండి. బాగా వేయించడం వల్ల అందులోని పచ్చివాసన పోతుంది.

-కాస్త కలర్ మారేంతవరకు వేపిన తర్వాత స్టవ్ ఆపేయండి. వేయించిన పొట్టు మినపప్పును ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే 1 కప్పు బియ్యం వేసి రెండు కలిసేలా కలిపి నీళ్లు పోసి మాడు సార్లు బాగా కడిగి తర్వాత నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టండి.

-తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చెయ్యండి. తర్వాత అందులో 3 లవంగాలు, 2 యాలకలు, ఇంచు దాల్చినచెక్క, 1 స్టార్ అనాస, 2 బిర్యానీ ఆకులు, ఎండుమిరపకాయల ముక్కలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి కాస్త ఫ్రై చెయ్యాలి.

-అవి కొంచెం వేగిన తర్వాత అందులో అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత అందులో 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత అందులో అర టీస్పూన్ మిరియాలు కచ్చాపచ్చగా దంచి వేయండి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయనక్కర్లేదు. ఒకసారి కలిపే తర్వాత అందులో నానబెట్టిన మినపప్పు రైస్ ని వేసి మీడియం మంట మీద అందులో ఉండే నీటి తేమ అంతా ఇగిరిపోయేందుకు 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చెయ్యాలి

-ఇప్పుడు అందులో 4 కప్పుల నీళ్లు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూతపెట్టి 2-3 విజిల్స్ వచ్చేదాకా పెద్ద మంట మీద ఉడికించి స్టవ్ ఆపేయండి.

-అంతే మినుములు అన్నం రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, October 29, 2026, 19:49 [IST]
Desktop Bottom Promotion