Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
ఈ పచ్చడి రుచి చూస్తే ఆహా అనాల్సిందే..రుచితో పాటు ఆరోగ్యం కూడా..ఎలా చేసుకోవాలంటే
తెలుగు వారి ఇళ్లలో పచ్చడి లేని భోజనం ఉండదంటే అతిశయోక్తి కాదు. పొద్దున్నే తినే ఇడ్లీ, దోసెల దగ్గర నుంచి నైట్ డిన్నర్ దాకా పచ్చడి మన ఆహారంలో ఓ ముఖ్యమైన భాగం. రోజూ చేసుకునే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీలకు భిన్నంగా కాస్త ఘాటుగా, కమ్మగా ఏదైనా తినాలనిపించినప్పుడు గుర్తుకువచ్చేదే వెల్లుల్లి కారం. వెల్లుల్లి ఘాటైన వాసన, ఎండుమిర్చి కారం, జీలకర్ర సువాసన కలిసి అద్భుతమైన రుచిని అందిస్తాయి. ఇది కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ ఒక్క పచ్చడి చేసుకుంటే చాలు టిఫిన్ తో పాటు భోజనంలోకి కూడా నంజుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. నోరూరించే వెల్లుల్లి కారం కేవలం 10 నిమిషాల్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
వెల్లుల్లి రెబ్బలు - 15-20
ఎండు మిరపకాయలు - 10- 15
జీలకర్ర -1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె -2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా
బెల్లం ముక్క -కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఒక చెంచా నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
-ఇప్పుడు అందులోనే ఎండు మిరపకాయలను తుంచి వేసి అవి మాడిపోకుండా దోరగా, సువాసన వచ్చేవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఈ పచ్చడిని రోట్లో దంచుకుంటే వచ్చే రుచే వేరు. వీలైతే ముందుగా చల్లారిన మిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి దంచుకోవాలి. అవి కొద్దిగా నలిగిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా దంచుకోవాలి.
-ఒకవేళ రోలు అందుబాటులో లేకపోతే మిక్సీ జార్లో మొదట వేయించిన మిరపకాయలు, జీలకర్ర వేసి ఒకటి రెండుసార్లు తిప్పాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కొత్తిమీర, మిగిలిన చెంచా నూనె వేసి, నీళ్లు పోయకుండా గట్టిగా రుబ్బుకోవాలి.
-చివరగా మీకు ఇష్టమైతే చిన్న బెల్లం ముక్క కూడా వేసి మరోసారి రుబ్బుకుంటే కారం, ఉప్పు, తీపి సమపాళ్లలో కలిసి రుచి అమోఘంగా ఉంటుంది. అంతే ఘాటైన, కమ్మనైన వెల్లుల్లి కారం రెడీ.
-వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఈ వెల్లుల్లి కారం వేసుకుని తింటే... ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఇడ్లీ, దోశ, చపాతీ, రోటీలతో కూడా ఇది అద్భుతంగా ఉంటుంది.
ఈ పచ్చడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచుకుంటే వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






