Latest Updates
-
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.!
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
ఆదివాసీల జీవన విధానం, వారు తినే ఆహారం గ్రామాలు, పట్టణవాసులతో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అడవుల్లో ఏ మందులతో పండని కూరగాయలు, ఆకుకూరలను వారు అమృతంలా ఆస్వాదిస్తారు. అందుకే వారు అంత బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఆదిలాబాద్ అడవుల్లో నివసించే ఆదివాసీలు రోటీ పచ్చళ్లు చాలా ఇష్టంగా తింటారు. అందులో బంగాళాదుంప, క్యాప్సికం రోటీ పచ్చడి ముందు వరుసలో ఉంటుంది. మీరూ ఆ రుచిని, బలాన్ని ఆస్వాదించాలంటే మీ ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే..

ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
పండు మిర్చి- 10
ఉల్లిపాయ- ఒకటి
క్యాప్సికం- ఐదు(మీడియం సైజు)
బంగాళాదుంపలు- నాలుగు
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు- పది
జీలకర్ర- టీస్పూన్
పసుపు- పావు టీస్పూన్
చింతపండు- నిమ్మకాయ సైజు
కొత్తిమీర- కొద్దిగా
కరివేపాకు- రెండు రెబ్బలు
ఉప్పు- రుచికి సరిపడా
ఆలూ క్యాప్సికం రోటీ పచ్చడి తయారీ విధానం
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్!
ముందుగా పండు మిర్చి, ఉల్లిపాయ ముక్కలను రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు క్యాప్సికం, బంగాళాదుంపను పొడుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పైన పాన్ పెట్టుకుని నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత రోట్లో వేసి దంచిన మిర్చి, ఉల్లిపాయ మిశ్రమం వేసుకుని కలిపి పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలి.

ఇప్పుడు కట్ చేసిన క్యాప్సికం, బంగాళాదుంప ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కడిగిన చింతపండు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి మరోసారి కలిపి ముక్కలు మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే 'ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
ఈ మిశ్రమం మొత్తాన్ని రోట్లో వేసి వీలైనంత వరకు మెత్తగా అయ్యేలా దంచుకోవాలి. అంతే క్యాప్సికం, ఆలూ పచ్చడి రెడీ. ఈ పచ్చడికి తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు. లంచ్‌లో లేదా రాత్రి డిన్నర్లో జొన్న రొట్టెలోకి ఈ పచ్చడి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. బలం, ఎనర్జీ కోసం తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
