Latest Updates
-
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.!
100కి పైగా రోగాలు నయం చేసే అవిసె గింజల కారం పొడి..టిఫిన్స్, వేపుడు కూరలకు నెక్ట్స్ లెవల్ టేస్ట్
మన తెలుగు ఇళ్లలో కారం పొడులకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది.ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి అల్పాహారాల్లో, వేడి వేడి అన్నంలో కారం పొడి వేసుకుని తింటే ఆ రుచే వేరు. కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందించే కారం పొడిని మన ఆహారంలో భాగం చేసుకుంటే ఎంత బాగుంటుంది? అటువంటి ఒక అద్భుతమైన, పోషకాల గని అయిన పొడినే అవిసె గింజల కారం పొడి.
అవిసె గింజల కారం పొడిని ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల పాటు తాజాగా, ఘుమఘుమలాడుతూ ఉంటుంది. బ్యాచిలర్స్ కు కూడా ఈ కారం పొడి చాలా హెల్ప్ అవుతుంది. 100కి పైగా రోగాలను నయం చేసే ఈ శక్తి ఈ అవిసె గింజల కారం పొడిలో ఉందని చెబుతారు. టిపిన్స్ లోకే కాకుండా వేపుడు కూరలకు ఆఖరును ఈ పొడి వేసి కలిపి దింపితే రుచి అద్బుతంగా ఉంటుంది.

అవిసె గింజల కారం పొడి తయారీకి కావాల్సిన
పదార్థాలు
-అవిసె గింజలు
-పచ్చి శెనగపప్పు
-పొట్టుమినపప్పు
-ఆయిల్
-జీలకర్ర
-ధనియాలు
-ఎండుమిరపకాయలు
-వెల్లుల్లి
-చింతపండు
-ఉప్పు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ లేదా కడాయి పెట్టి అందులో 1 టీస్పూన్ ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.
-వేడెక్కిన ఆయిల్ లో అరకప్పు అవిసె గింజలు వేసి తక్కువ మంట మీద చిట్లనివ్వాలి. తక్కువమంట మీద వేగడానికి సమయం పడుతుంది..కానీ గింజ లోపలి దాకా వేగి మంచి సువాసనను ఇస్తుంది.
-అవిసె గింజలు చిట్లిన తర్వాత వాటిని బాండీలో నుంచి ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీలో 1 టీస్పూన్ ఆయిల్ వేసి వేడి చేశాక ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు వేసి 40 సెకన్లు వేపాక టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు వేసి మంచి సువాసన వచ్చి ఎర్రగా అయ్యేదాకా వేపుకోవాలి.
-తర్వాత బాండీలో 1 టీస్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి మంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి. తర్వాత బాండీలోని మొత్తం పప్పులను ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న బాండీలో 17-20 ఎండుమిరపకాయలు, 8 వెల్లుల్లి రెబ్బలు వేసి వేపుకోవాలి. ఎండుమిర్చి రంగుమారగానే స్టవ్ ఆపేసేయాలి. ఎండుమిరపకాయలను,వెల్లుల్లిని వేర్వేరుగా ఓ ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఒక్క వెల్లుల్లి తప్ప మిగిలిన వేయించినవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి ఇందులోనే ఉసిరికాయ సైజ్ అంత చింతపండు, రుచికి సరిపడా రాళ్ల ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
-కూర కారంలా వాడుకోవాలనుకుంటే మెత్తగా, ఇడ్లీ దోశలకు అయితే కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా వేయించిన వెల్లుల్లిని ఈ పొడిలో వేసి జస్ట్ పల్స్ చేసి తీసుకుంటే చాలు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
