ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్‌.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!

ఆదివాసీల జీవన విధానం, వారు తినే ఆహారం గ్రామాలు, పట్టణవాసులతో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అడవుల్లో ఏ మందులతో పండని కూరగాయలు, ఆకుకూరలను వారు అమృతంలా ఆస్వాదిస్తారు. అందుకే వారు అంత బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఆదిలాబాద్‌ అడవుల్లో నివసించే ఆదివాసీలు రోటీ పచ్చళ్లు చాలా ఇష్టంగా తింటారు. అందులో బంగాళాదుంప, క్యాప్సికం రోటీ పచ్చడి ముందు వరుసలో ఉంటుంది. మీరూ ఆ రుచిని, బలాన్ని ఆస్వాదించాలంటే మీ ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే..

The Adivasis health secret Capsicum potato and dried red chili roti chutney

ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు

పండు మిర్చి- 10
ఉల్లిపాయ- ఒకటి
క్యాప్సికం- ఐదు(మీడియం సైజు)
బంగాళాదుంపలు- నాలుగు
నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు- పది
జీలకర్ర- టీస్పూన్‌
పసుపు- పావు టీస్పూన్‌
చింతపండు- నిమ్మకాయ సైజు
కొత్తిమీర- కొద్దిగా
కరివేపాకు- రెండు రెబ్బలు
ఉప్పు- రుచికి సరిపడా

ఆలూ క్యాప్సికం రోటీ పచ్చడి తయారీ విధానం

మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్!

ముందుగా పండు మిర్చి, ఉల్లిపాయ ముక్కలను రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు క్యాప్సికం, బంగాళాదుంపను పొడుగు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పైన పాన్‌ పెట్టుకుని నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత రోట్లో వేసి దంచిన మిర్చి, ఉల్లిపాయ మిశ్రమం వేసుకుని కలిపి పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలి.

The Adivasis health secret Capsicum potato and dried red chili roti chutney

ఇప్పుడు కట్‌ చేసిన క్యాప్సికం, బంగాళాదుంప ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కడిగిన చింతపండు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి మరోసారి కలిపి ముక్కలు మెత్తగా అయిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే 'ఎగ్‌ ఖాగినా’.. హైదరాబాద్‌ దాబా స్టైల్‌లో ఇలా చేసేయండి.!

ఈ మిశ్రమం మొత్తాన్ని రోట్లో వేసి వీలైనంత వరకు మెత్తగా అయ్యేలా దంచుకోవాలి. అంతే క్యాప్సికం, ఆలూ పచ్చడి రెడీ. ఈ పచ్చడికి తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు. లంచ్‌లో లేదా రాత్రి డిన్నర్‌లో జొన్న రొట్టెలోకి ఈ పచ్చడి కాంబినేషన్‌ అద్భుతంగా ఉంటుంది. బలం, ఎనర్జీ కోసం తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 23, 2026, 17:07 [IST]
Desktop Bottom Promotion