మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్‌ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.!

పాలు లేకుండా ఏ ఇంట్లోనూ దినచర్య ప్రారంభం కాదు. ఉదయాన్నే పిల్లలకు పాలు, పెద్దలకు టీ లేదా కాఫీ వీటి తర్వాతనే మిగతా కార్యక్రమాలు మొదలవుతాయి. అయితే మీరు తీసుకునే పాలు స్వచ్ఛమైనవేనా. ఒకప్పుడు గేదెల పొదుగు నుంచి పాలను పిండి అప్పటికప్పుడు విక్రయించేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. జనాభా పెరిగింది. పాల ఉత్పత్తి తగ్గింది. అవసరం పెరిగింది. దీంతో కల్తీ రాజ్యమేలుతోంది. ఇది పాలకూ వ్యాపించింది. ప్యాకెట్‌ పాలు పుట్టుకొచ్చాయి. దీంతో తెల్లగా ఉంటే స్వచ్ఛమైన పాలు అనుకుని పొరబడి రోగాలను కొనితెచ్చుకుంటున్నాం. మరి మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఎలా తెలుసుకోవాలి.. ఎలాంటి టెస్ట్‌లు చేయాలి తెలుసుకుందాం..

Fssai explains here how to check adulterated milk with these simple test

ఈ రోజుల్లో పాలలో పోషకాల మాటేమో గానీ కల్తీనే ఎక్కువగా ఉంటోంది. డిటర్జెంట్‌, బ్లీచింగ్‌ ఇలా విస్తుపోయే విషయాలు పాలలో కనిపిస్తున్నాయి. దీంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వివిధ కెమికల్స్‌, డిటర్జెంట్లు ఇలా కలిపి ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఈ క్రమంలో మీరు కొనే పాలు స్వచ్ఛంగా ఉన్నాయా, కల్తీ కలిసిందా ఇంట్లోనే తెలుసుకోవచ్చు. ఈ సింపుల్‌ టెస్టుల ద్వారా పాలలో కల్తీ ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు.

కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు!కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు!

FSSAI మొదటి టెస్ట్‌

FSSAI నిబంధనల ప్రకారం మీరు పాలలో డిటర్జెంట్ కల్తీని తనిఖీ చేసుకోవచ్చు. ఒక గ్లాసులో 5 నుంచి 10 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాలి. తర్వాత స్పూన్‌తో బలంగా కదపాలి. కదిపిన తర్వాత పాలు నురుగులుగా రావడం, బుడగలు ఏర్పడితే అందులో డిటర్జెంట్‌ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్వచ్ఛమైన పాలలో నురుగు రాదు. ఒకవేళ నురుగు వచ్చినా అవి కాసేపటికి పోతాయి.

Fssai explains here how to check adulterated milk with these simple test

రెండో టెస్ట్‌

పాలలో కొన్ని చుక్కల అయోడిన్‌ టింక్చర్‌ వేసి చూడండి. అది ముదురు నీలంలోకి మారినట్లయితే అందులో డిటర్జెంట్‌, యూరియా లేదా స్టార్చ్‌ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ టెస్ట్‌ చేసే ముందు ముందుగా పాలను మరిగించాలి. తర్వాత చల్లారనివ్వాలి. అప్పుడు ఈ టెస్ట్‌ చేయాలి.

పొట్టపై స్ట్రెచ్‌ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్‌ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.!పొట్టపై స్ట్రెచ్‌ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్‌ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.!

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

పాలు కొనుగోలు చేసే ముందు ప్యాకెట్‌పై అక్షర దోషాలు, లోగోను తప్పనిసరిగా సరిచూసుకోవాలి. FSSAI లోగో, చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌ నంబర్‌ తనిఖీ చేసుకోవాలి. ఈ వివరాలు ఉంటే పాలు స్వచ్ఛమైనవి. స్వచ్ఛతకి హామీ ఇచ్చే వివరాలు లేని పాల ప్యాకెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయకండి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, September 23, 2026, 15:15 [IST]
Desktop Bottom Promotion