కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!

అన్నా అని పిలిచింది..చెల్లెమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించాడు..రాఖీ పండక్కి సోదరుడిగా భావించి రాఖీ కూడా కట్టింది..కట్ చేస్తే అతడితో లేచిపోయింది ఓ వివాహిత. భర్త,పిల్లలను వదిలేసి రాఖీ కట్టినోడికే మనసిచ్చి లేచిపోయింది.

వావివరసలు ఏం లేవు..కామానికి కావే బంధాలు అనర్హం అన్నట్లు ప్రస్తుత సమాజం తీరు ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఆ వివాహిత ఎవరు, అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

UP Woman Elopes with Husband Friend Just a Week After Tying Rakhi

రాఖీ కట్టి..అతడితోనే ఎందుకు లేచిపోయింది

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పహర్ గావ్ కు చెందిన శివాని దూబే కి 2016 లో అదే గ్రామానికి చెందిన ప్రదుమ్ సింగ్ పరిమార్ ని ప్రేమించి పెళ్లించి చేసుకుంది. వీరి ప్రేమ వివాహానికి శివానీ కుటుంబసభ్యలు ఒప్పుకోలేదు. అయినప్పటికీ తల్లిదండ్రులను ఎదిరించి ప్రదుమ్ సింగ్ ని శివానీ పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత శివానీ,ప్రదుమ్ సింగ్ దంపతులు ఇసానగర్ లోని శ్రీరామ్ కాలనీకి మకాం మార్చారు. శివానీ,ప్రదుమ్ సింగ్ దంపతులకు ప్రస్తుతం 8 ఏళ్ల కొడుకు ఉన్నాడు.

అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే..అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే..

శివానీ,ప్రదుమ్ సింగ్ సంసారం హాయిగా సాగిపోతుందన్న సమయంలో వారి ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెట్టాడు. అతడి పేరే సుమిత్ అగర్వాల్. ఇతను మరెవరో కాదు..ప్రదుమ్ సింగ్ క్లోజ్ ఫ్రెండే ఈ సుమిత్ అగర్వాల్. తరచుగా ఫ్రెండ్ అయిన ప్రదుమ్ సింగ్ ని కలవడానికి అతడి ఇంటికి వెళ్లేవాడు సుమిత్ అగర్వాల్. ఇదే క్రమంలో అతడి భార్య శివానీతో కూడా మెల్లిగా పరిచయం పెంచుకున్నాడు. సుమిత్ అగర్వాల్.. శివానీని చెల్లిగా భావించేవాడని, శివానీ కూడా ప్రతి ఏడాది రాఖీ పండగ రోజున అతడికి రాఖీ కట్టేదని ప్రదుమ్ సింగ్ చెబుతున్నాడు.

అయితే ఆ తర్వాత కొంతకాలానికి తన భార్య, తన ఫ్రెండ్ మధ్య సన్నిహిత సంబంధం ఉన్నట్లు ప్రదుమ్ సింగ్ కి అర్థం అయ్యింది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం శివానీ..సుమిత్ అగర్వాల్ తో లేచిపోయింది. భర్త క్లోజ్ ఫ్రెండ్ ని అన్నా అంటూ పిలిచి మూడేళ్లుగా రాఖీ కట్టి,చివరికి అతడితోనే,అది కూడా రాఖీ కట్టిన వారం రోజులకే శివానీ లేచిపోవడంపై కుటుంబసభ్యులు, బంధువులు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

పోలీస్ రక్షణ కోరుతూ..

అయితే 2026 సెప్టెంబర్ 17న శివానీ,సుమిత్ అగర్వాల్ ఇసా నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. భర్త నుంచి తాను విడిపోవాలుకుంటున్నానని, సుమిత్ తోనే తాను ఇష్టపూర్వకంగా కలిసి ఉంటున్నానని,తమకు రక్షణ కల్పించాలంటూ పోలీస్ స్టేషన్ లో శివానీ ఓ అప్లికేషన్ ఇచ్చింది. అయితే కొడుకుని మాత్రం తానే చూసుకుంటానని ప్రదుమ్ సింగ్ అన్నట్లు సమాచారం.

Story first published: Wednesday, September 23, 2026, 14:00 [IST]
Desktop Bottom Promotion