కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం!

జ్యోతిష్యం ప్రకారం, నీడ గ్రహమైన రాహువు, మనస్సుకు కారకుడైన చంద్రుడు ఒకే రాశిలో కలవడం వల్ల ఈ ప్రమాదకరమైన గ్రహణ యోగం సృష్టించబడుతుంది. సెప్టెంబర్ 23వ తేదీన చంద్రుడు.. శని దేవుని ఆధిపత్యంలో ఉన్న కుంభ రాశిలోకి ప్రవేశించడం.. కుంభ రాశిలో అప్పటికే రాహువు ఉంటాడు..దీంతో కుంభ రాశిలో రాహు-చంద్రుల ప్రమాదకర కలయిక జరిగి, భయంకరమైన గ్రహణ యోగం ఏర్పడుతుంది.

కుంభ రాశిలో ఏర్పడే ఈ అశుభ యోగం కారణంగా పలు రాశుల వారి జీవితాల్లో, ముఖ్యంగా ఆర్థిక, కెరీర్ పరమైన విషయాల్లో తీవ్రమైన ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమయ్యే ఈ గ్రహణ యోగం..సెప్టెంబర్ 25 వరకు ఉంటది. దీని కారణంగా ఏయే రాశుల వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలో ఇక్కడ చూడండి.

grahan yog september 23 rahu moon conjunction impact on 3 zodiac signs

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి రాబోయే కొన్ని రోజులు పరీక్షా సమయం లాంటిది. మీ రాశి నుంచి ఎనిమిదవ ఇంట చంద్రుడు, రాహువుతో కలిసి ఈ గ్రహణ యోగాన్ని సృష్టిస్తున్నాడు. అష్టమ స్థానం కష్టాలకు ప్రతీక. దీని ఫలితంగా మీకు ఊహించని ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా సమాజంలో మీకున్న గౌరవ మర్యాదలు, ప్రతిష్టలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. మీ కెరీర్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఇబ్బందులు తప్పవు. ప్రతి అడుగు ఆచితూచి వేయడం చాలా అవసరం.

కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రాహు-చంద్రుల కలయిక వల్ల ఏర్పడే గ్రహణ యోగం ఆరవ ఇంట జరగబోతోంది. జ్యోతిష్య శాస్త్రంలో ఆరో ఇల్లు శత్రువులు, రోగాలు, అడ్డంకులకు సూచికగా భావిస్తారు. కాబట్టి ఈ సమయంలో మీ శత్రువులు, రహస్య ప్రత్యర్థుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆఫీసులో గానీ, వ్యాపారంలో గానీ ఎలాంటి నిర్ణయమైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. ఇతరులను గుడ్డిగా నమ్మి అప్పులు ఇవ్వడం, తీసుకోవడం లాంటివి చేస్తే మోసపోయే ప్రమాదం ఉంది.

మీన రాశి

మీన రాశి వారిపై కూడా ఈ గ్రహణ యోగం తన ప్రతాపాన్ని చూపనుంది. మీ రాశి చక్రం ప్రకారం పన్నెండవ ఇంట ఈ అశుభ యోగం ఏర్పడుతోంది. పన్నెండో ఇల్లు ధన నష్టానికి, వృథా ఖర్చులకు, ఆసుపత్రి ఖర్చులకు ప్రతీక. అందుకే ఈ సమయంలో మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అలాగే ఆర్థిక విషయాల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకండి. మీ పనిపై మీరు పూర్తి ఏకాగ్రత పెట్టకపోతే లేనిపోని సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం బెటర్.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Wednesday, September 23, 2026, 16:52 [IST]
Desktop Bottom Promotion