Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
షుగర్ వ్యాధి నుంచి కాపాడి,బరువు తగ్గించే ఆయుర్వేదిక్ రెసిపి..ఈజీగా ఎలా చేసుకోవాలంటే
భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో మినుములు ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. ఇడ్లీ, దోశ, వడల వంటి అనేక ప్రసిద్ధ వంటకాలలో మినుములను ప్రధానంగా ఉపయోగిస్తారు. అయితే ఈ మినుములతో తయారుచేసే పులగం, ఒక సాధారణ వంటకంలా కనిపించినా దాని రుచి, పోషక విలువలు అద్భుతం. ఇది ఒక సంప్రదాయ, సౌకర్యవంతమైన ఆహారం, ఇది సులభంగా జీర్ణమవుతుంది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిని మధ్యాహ్నా భోజనంలోకి లేదా రాత్రి డిన్నర్ లోకి ఎప్పుడు తిన్నా అద్భుతంగానే ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఎంతో పుష్ఠినిస్తుంది. ఇది తక్కువ మసాలాలు కలిగి ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకు, వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇది చాలా మంచి ఆహారం.
ముఖ్యంగా షుగర్ వ్యాధి నుంచి కాపాడటంలో ఇది చాలా మేలు చేస్తుంది. మినుములలోని ఫైబర్ రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఇది గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది..ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలలో ఆకస్మిక పెరుగుదలను నివారిస్తుంది. మినుములలోని ప్రోటీన్,ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి,అతిగా తినడాన్ని తగ్గిస్తాయి. దీంతో ఇది బరువు నియంత్రణలో లేదా తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ఇంట్లోనే ఈజీగా మినుముల పులగం తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

మినుముల పులగం తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-మినుములు
-మెంతులు
-వెల్లుల్లి
-మెంతులు
-ఉప్పు
-పచ్చి కొబ్బరి తురుము
-పచ్చిమిర్చి
-జీలకర్ర
-కరివేపాకు
-నువ్వుల నూనె
మినుముల పులగం తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో అరకప్పు పొట్టు మినపప్పు వేసి మంచి సువాసన వచ్చేదాకా తక్కువ మంట మీద వేయించి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 1 కప్పు కడిగిన బియ్యం, వేయించిన మినుములు, పొట్టు తీసిన 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, రుచికి సరిపడా ఉప్పు, మూడున్నర కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంట మీద 4 విజిల్స్ రానివ్వాలి.
-తర్వాత మూత తీసి మెత్తగా ఉడికిన పులగంలో అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి మొత్తాన్ని బాగా కలపండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఓ బాండీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె పోసి వేడి చేసి ఇందులో 3 పచ్చిమిర్చి చీలికలు, అర టీస్పూన్ జీలకర్ర,రెండు రెమ్మల కరివేపాకు ఎర్రగా వేయించాలి.
-వేయించిన తాళింపుని పులగంలో వేసి కలపండి. అంతే ఆయుర్వేదిక్ పెసిపి మినుముల పులగం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications