Latest Updates
-
వేడి చేసి మూత్రం సరిగ్గా రావట్లేదా? మన పూర్వీకుల ఈ పచ్చడి తింటే చాలు..చుక్క నూనె లేకుండానే క్షణాల్లో చేయండిలా -
చాలా తక్కువ టైంలో రుచికరమైన, పౌష్టికమైన పచ్చడి.. ఉల్లిపాయలతో ఈజీగా చేసేయండిలా.. -
పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు..పక్షవాతం రాకుండా అడ్డుకునే బెస్ట్ వ్యాయామం ఇదే! -
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా.. -
ఇవేం లవ్ మ్యారేజ్ లు రా బాబోయ్: పెళ్లయిన ఏడాదికే ప్రియుడితో హోటల్ లో భర్తకు దొరికిన భార్య..వీడియో చూడండి -
ఒరేయ్ అబ్బాయిలు బంపరాఫర్...పెళ్లి కానోళ్లకు ఫ్రీగా ఫిన్లాండ్ వీసా, అక్కడోళ్లతో డేటింగ్..ఖర్చులన్నీ వాళ్లవే! -
పోషకాలు పుష్కలంగా, రుచి అత్యద్భుతంగా..సొరకాయ రొట్టెలు ఈజీగా చేసుకోండిలా -
విటమిన్ B12 లోపానికి చెక్, నరాల వీక్నెస్ తగ్గించే మేక లివర్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే..
ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు
భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా మన తెలుగు సంప్రదాయంలో రుచికి ఎంత ప్రాధాన్యత ఉందో, ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. మన పెద్దనాన్నల కాలం నుండి ఆచారంలో ఉన్న ఎన్నో వంటకాలు కేవలం నాలుకకు రుచిని ఇవ్వడమే కాకుండా, శరీరానికి అద్భుతమైన శక్తిని, రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అలాంటి వాటిలో ముందు వరుసలో నిలిచేది పల్లీ నువ్వుల బెల్లం లడ్డు.
పల్లీలు , నువ్వులు, బెల్లం ఈ మూడూ ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్యమైన పోషకాల ఖనిజాలు. ఈ మూడింటి కలయికతో తయారయ్యే లడ్డు తియ్యగా ఉండటమే కాకుండా, శరీరానికి కావలసిన ప్రొటీన్లు, ఐరన్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులను సమృద్ధిగా అందిస్తుంది. ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు ఆ రోజులో మన శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు లభిస్తాయి. దీనిని తయారుచేసుకోడానిక కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-వేరుశెనగపప్పు
-జీడిపప్పు
-బాదంపప్పు
-తెల్ల నువ్వులు
-బెల్లం
-నెయ్యి
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా..
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 100 గ్రాముల వేరుశెనగపప్పు(పల్లీలు)వేసి బాగా వేయించాలి.
-వేగిన పల్లీలను ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో 20-30 గ్రాముల బాదం, జాడిపప్పు వేసి వేయించాలి. తర్వాత వీటిని మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోండి. దీనిని ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిలో వేసి కలిపేయండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో పావు కేజీ తెల్ల నువ్వులు వేసి వేయించుకోండి. వేయించుకున్న నువ్వులలో కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. మిగతా ఫ్రై చేసుకున్న నువ్వులను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత దీన్ని కూడా పల్లీల పొడిలో వేసి కలుపుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో రుచికి సరిపడా బెల్లం వేసి,ఇందులోనే కొంచెం నీళ్లు పోసి పాకం పెట్టుకోవాలి. పాకం అవ్వగానే అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోండి. తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న మొత్తం అన్ని పొడుల మిశ్రమం వేసి మొత్తానికి పాకం పట్టేలా బాగా కలుపుకోండి.
-తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. తర్వాత ఇందులో పక్కన ఉంచుకున్న వేయించిన నువ్వులు, 2 స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి. దీనిని మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోండి.
-అంతే హెల్తీ, టేస్టీ పల్లీ నువ్వుల లడ్డు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
