Latest Updates
-
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్?
శనగపిండి, కీర దోసకాయ ఉంటే చాలు..10 నిమిషాల్లో క్రిస్పీ దోశ..ఎలా చేసుకోవాలంటే..
ఉరుకులు పరుగుల జీవితంలో సమయం తక్కువగా ఉన్నప్పుడు, ఆరోగ్యంతో పాటు రుచిని కూడా అందించే బ్రేక్ ఫాస్ట్ కావాలని అందరూ కోరుకుంటారు. ఎప్పుడూ తినే ఇడ్లీ, దోశ లేదా ఉప్మా తిని విసుగొచ్చినప్పుడు, చాలామంది శనగపిండి లేదా బొంబాయి రవ్వతో దోశ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ రెగ్యులర్ దోశకు కొద్దిగా వెరైటీ జోడించి, మరింత పోషక విలువలున్న కీర దోసకాయ దోశను మీరు ఎప్పుడైనా రుచి చూశారా?
సాధారణంగా కీర దోసకాయ అనగానే మనకు సలాడ్స్ లేదా పచ్చడి మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ దాంతో కమ్మని దోశ కూడా తయారు చేయవచ్చు. దోసకాయలో నీటి శాతం అధికంగా ఉండి, క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి, కడుపు తేలికగా ఉండాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. పైగా ఇది శరీరానికి చలవ చేస్తుంది. కేవలం పది నిమిషాల్లో వేడివేడిగా సిద్ధమయ్యే ఈ కీర దోసకాయ దోశ పిల్లల లంచ్ బాక్స్ కు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది.

కీర దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
కీర దోసకాయ: 1 పెద్దది
శనగపిండి: 1 కప్పు
బొంబాయి రవ్వ: 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి: 1
కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: అర టీస్పూన్
పసుపు: పావు టీస్పూన్
కారం: అర టీస్పూన్
ఉప్పు: మీ రుచికి తగినంత
నీళ్లు: పిండి కలుపుకోవడానికి తగినంత
నూనె: దోశ కాల్చుకోవడానికి
కీర దోశ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో సన్నగా తురుముకున్న కీర దోసకాయను వేయండి. ఇప్పుడు ఆ దోసకాయ తురుముకు ఒక కప్పు శనగపిండి, కరకరలాడే రుచి కోసం కొద్దిగా బొంబాయి రవ్వను కలపండి. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, జీలకర్ర, కొద్దిగా పసుపు, కారం మీ రుచికి తగినట్లుగా ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలా గరిటెతో కలుపుకోండి.
-దోసకాయలో ఇప్పటికే నీరు ఉంటుంది కాబట్టి చూసుకుంటూ కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ దోశ పిండి లాగా కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా నీళ్లలా కాకుండా, అలాగని మరీ గట్టిగా కాకుండా చూసుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ లేదా ఇనుప పెనం పెట్టి వేడి చేయండి. పెనం వేడెక్కాక కొద్దిగా నూనె లేదా నెయ్యి రాయండి. ఇప్పుడు గరిటెతో పిండిని తీసుకుని పెనం మీద గుండ్రంగా, కాస్త మందంగా పరుచుకోండి.
-మంటను సిమ్ లో లేదా మీడియంలో ఉంచి, అంచుల చుట్టూ కొద్దిగా నూనె వేయండి. అద్భుతమైన సువాసన వస్తుండగా.. రెండు వైపులా తిప్పుతూ, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారి, కరకరలాడేలా ఉడికే వరకు కాల్చుకోండి.
-అంతే ఎంతో కమ్మని, ఆరోగ్యకరమైన వేడి వేడి కీర దోశ రెడీ. దీన్ని చల్లని పెరుగుతో కానీ, పుదీనా లేదా పల్లీల చట్నీతో కానీ నంజుకుని తింటుంటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
