Latest Updates
-
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు..
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్!
క్రిస్పీ బోండా, గారెలు అయినా లేదా వేడివేడి మల్లెపూవు లాంటి ఇడ్లీ, మెత్తని ఉప్మా అయినా, కరకరలాడే రోస్ట్ దోసె అయినా.. వాటి రుచిని రెట్టింపు చేసేది అందులోకి నంజుకునే చట్నీ మాత్రమే. అయితే రోజూ మనం చేసుకునే సాధారణ తెల్ల కొబ్బరి చట్నీని తిని తిని మీ నాలుకకు బోర్ కొట్టిందా? ఒక కొత్త ఉత్సాహాన్ని, అదిరిపోయే రుచిని పరిచయం చేయాలని అనుకుంటున్నారా?
అయితే ఈసారి మీరు చట్నీ చేసేటప్పుడు కాస్త విభిన్నంగా నార్త్ కర్ణాటక స్టైల్ లో తయారు చేసి చూడండి. సాధారణ కొబ్బరి చట్నీకి, దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇందులో వాడే పుదీనా, వెల్లుల్లి,పసుపు ఈ చట్నీకి ఒక ప్రత్యేకమైన రంగును, ఘుమఘుమలాడే సువాసనను ఇస్తాయి. నోరూరించే నార్త్ కర్ణాటక స్పెషల్ కొబ్బరి చట్నీని మీ ఇంట్లో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
వేయించిన పల్లీలు లేదా జీడిపప్పు - పావు కప్పు
పచ్చిమిర్చి - 5 (మీ కారాన్ని బట్టి)
చింతపండు - చిన్న ఉసిరికాయంత
జీలకర్ర - పావు టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 2
కరివేపాకు - ఒక రెమ్మ
పుదీనా ఆకులు - 10
కొత్తిమీర - ఒక గుప్పెడు
పసుపు - ఒక చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
పంచదార లేదా బెల్లం - ఒక చిటికెడు
నీళ్లు - చట్నీకి సరిపడా
తాలింపు కోసం
నూనె - 1 లేదా 2 టీస్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
మినపపప్పు - 1 టీస్పూన్
ఎండు మిరపకాయ - 1 లేదా 2
కరివేపాకు - కొద్దిగా
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే!
తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులో పచ్చి కొబ్బరి తురుము, వేయించిన పల్లీలు (లేదా జీడిపప్పు),పచ్చిమిర్చి, పుల్లని చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, పుదీనా ఆకులు,రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, చిటికెడు పంచదార వేసి, కొద్దిగా నీళ్లు పోయండి.
-ఇప్పుడు మిక్సీని ఆన్ చేసి మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా, కాస్త బరకగా ఉండేలా రుబ్బుకోండి. నార్త్ కర్ణాటక చట్నీల అసలు రహస్యం ఈ బరకదనంలోనే ఉంటుంది.
-చివరగా గుప్పెడు తాజా కొత్తిమీరను అందులో వేసి, ఒక్కసారి అలా మిక్సీ తిప్పి ఆపేయండి. ఆ తర్వాత ఈ అద్భుతమైన చట్నీ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-ఇప్పుడు తాలింపు కోసం.. స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టి నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత మినపపప్పు వేసి దోరగా వేయించండి. చివరగా ఎండుమిర్చి, కరివేపాకు వేసి స్టవ్ ఆపేయండి.
-ఈ వేడివేడి తాలింపును రెడీ చేసుకున్న చట్నీపై పోసి, గరిటతో మెల్లగా కలపండి.
-అంతే ఘుమఘుమలాడే, నోరూరించే నార్త్ కర్ణాటక స్పెషల్ కొబ్బరి చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
