Latest Updates
-
అనిరుధ్ - కావ్య మారన్ వెడ్డింగ్: గ్రీస్లోనే పెళ్లి ఎందుకు? అక్కడ ఉన్న ప్రత్యేకతలేంటి? -
జింక్, కాల్షియం, విటమిన్ ఈ, ప్రొటీన్ పుష్కలంగా ఉండే లడ్డు ఇదే ..ఎలా చేసుకోవాలో చూడండి -
రొమాంటిక్ మూడ్ చెడిపోకూడదంటే.. ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ విషయాలు అస్సలు మాట్లాడకండి -
చలికాలంలో మాత్రమే దొరికే లక్నో ఫేమస్ మఖన్ మలై.. మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
వంటకు ఏ నూనె వాడితే ఆరోగ్యానికి మంచిది? -
జలుబు, దగ్గు పరార్.. కేవలం 5 నిమిషాల్లో ఆరోగ్యకరమైన వెల్లుల్లి కొత్తిమీర సూప్ చేసుకోండిలా.. -
భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సెల్యూట్స్ ఒకేలా ఎందుకు ఉండవో తెలుసా? -
చలికాలంలో ఏ రోటీలు తింటే ఆరోగ్యానికి మంచిది? సజ్జ, జొన్న, రాగి లేదా గోధుమ? -
రోజూ నిమ్మరసం తాగుతుంటే కిడ్నీ రాళ్లు రావా? -
చలికాలం స్పెషల్ రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్ రిచ్ పెసరపప్పు సూప్..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
తిరుమల శ్రీవారి ప్రసాదం మలహోర.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా!
తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఆ ఏడుకొండలవాడు. ఆ తర్వాత ఆ స్వామివారికి భక్తితో సమర్పించే అద్భుతమైన ప్రసాదాలు. శ్రీవారి ప్రసాదంలో ఉండే కమ్మదనం మరెక్కడా దొరకదంటే అతిశయోక్తి కాదు. అలాంటి విశిష్టమైన ప్రసాదాలలో ఒకటే ఈ మరీచి అన్నం లేదా మలహోర. అత్యంత సులభంగా తయారయ్యే ఈ సాంప్రదాయక వంటకాన్ని, తిరుమలలో ముఖ్యంగా సాయంత్రం వేళల్లో స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
మెత్తగా ఉడికిన అన్నం.. దానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఘాటైన మిరియాల పొడి తోడైతే, ఆ రుచి వర్ణనాతీతం. కేవలం రెండు మూడు సాధారణ పదార్థాలతోనే తయారయ్యే ఈ మరీచి అన్నం, తింటున్నంత సేపూ ఓ దివ్యమైన అనుభూతిని పంచుతుంది. ఆ ప్రామాణికమైన శ్రీవారి ప్రసాదం రుచిని మీరు ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
పచ్చి బియ్యం - 1 కప్పు
నీళ్లు - 4 నుండి 5 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
ఇంగువ - ఒక చిటికెడు
ఆవు నెయ్యి - 1 టేబుల్ స్పూన్
మిరియాలు - 2 టేబుల్ స్పూన్లు
జింక్, కాల్షియం, విటమిన్ ఈ, ప్రొటీన్ పుష్కలంగా ఉండే లడ్డు ఇదే ..ఎలా చేసుకోవాలో చూడండి
తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని, నీళ్లలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
-కడిగిన బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్ లో వేసి, అందులో 4 నుండి 5 కప్పుల నీళ్లు పోయాలి. నీళ్లు కాస్త ఎక్కువగానే ఉండాలి, అప్పుడే అన్నం పాయసంలా మెత్తగా ఉడుకుతుంది.
-ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు ఇంగువ, 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసి బాగా కలపాలి. నెయ్యి, ఇంగువ వేయడం వల్ల ఉడికేటప్పుడే ఇల్లంతా కమ్మటి సువాసన వ్యాపిస్తుంది. కుక్కర్ మూతపెట్టి మీడియం మంట మీద 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-కుక్కర్ ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత, మూత తీసి గరిటెతో అన్నాన్ని మెత్తగా మాష్ చేయాలి. అన్నం ఎంత మెత్తగా ఉంటే మలహోర అంత కమ్మగా ఉంటుంది.
-ఇప్పుడు ఒక చిన్న పాన్ తీసుకుని, అందులో కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేసి, అందులో ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల పొడిని వేయాలి. ఈ మిరియాలు నెయ్యి మిశ్రమాన్ని, మెత్తగా చేసి పెట్టుకున్న అన్నంపై పోసి బాగా కలుపుకోవాలి.
-అంతే ఎంతో కమ్మనైన, సువాసనభరితమైన వేడివేడి మరీచి అన్నం సిద్ధం.
-చలికాలంలో లేదా వర్షాకాలంలో సాయంత్రం పూట ఈ వేడివేడి ప్రసాదాన్ని తింటుంటే శరీరానికి వెచ్చదనంతో పాటు, మనసుకు చెప్పలేనంత ప్రశాంతత కలుగుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
